Rain Alert: తెలంగాణ 3 రోజుల పాటు భారీ వర్షాలు
తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొంది.
తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొంది.
నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురవనుంది. రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈదురుగాలులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ నిపుణులు హెచ్చరించారు.
రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటలకు 40KM వేగంతో ఈదురుగాలులు వీవే అవకాశం ఉంది.
దేశంలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. దాంతో పాటూ ఎంటర్ అయిన నైరుతి రుతుపవనాలు వలన ఈ సారి పుష్కలంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ అంచనా వస్తోంది. జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వానలు కురుస్తాయని చెప్పింది.
దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు ముంచెత్తాయి. భారీ వడగళ్ల వర్షాలతో రాజదానిలో ఏడుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గాలిదుమారంతో చెట్లు కూలిపోయి, వీధులు జలమయమయ్యాయి.
వాతావరణం రోజురోజుకు అనేక మార్పులు సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరోవైపు రానున్న రోజుల్లో దేశంలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అశకాశాలున్నాయని తెలిపింది.
ఉత్తర, మధ్య భారతదేశంలో వడగాలులు విపరీతంగా వీచే అవకాశాలున్నట్లు భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.అయితే, ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మణిపుర్, మేఘాలయ్, నాగాలాండ్, త్రిపుర, మిజోరంలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది.