Cyclone Alert : బలపడిన అల్పపీడనం.. || Heavy Rains To Lash AP || Weather Report || RTV
ఏపీలో ఈ నెల 23వ తేదీన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీతో పాటు తమిళనాడులో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఏపీలో వచ్చే మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఇప్పటికే గత రాత్రి నుంచి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.