/rtv/media/media_files/2025/07/09/youtube-2025-07-09-20-22-37.jpg)
Youtube
ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ ప్రతిఒక్కరూ కూడా యూట్యూబ్ వాడకుండా ఉండలేరు. ప్రతిరోజూ అందులోని షార్ట్స్, లాంగ్ వీడియోస్ చూస్తుంటారు. ఇక యూట్యూబర్లు కొత్త కొత్త కంటెంట్‌తో వీడియోలు చేస్తూ డబ్బులు ఆర్జిస్తుంటారు. మరోవైపు యూట్యూబ్ కూడా ఎప్పటికప్పుడు రూల్స్ మారుస్తూ ఉంటుంది. అయితే ఈసారి కంటెంట్ క్రియెటర్లకు షాకిచ్చే అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రొగ్రామ్ (YPP) కింద.. ఎవరైతే రిపీటెడ్, రీయూజుడ్, మాస్ ప్రొడ్యూస్‌డ్ వీడియోలు అప్‌లోడ్ చేస్తారో వాళ్లకి ఆ వీడియోలకు రెవెన్యూ అనేది రాదు.
ఈ నిబంధన జులై 15 నుంచి అమల్లోకి రానుంది. యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త రూల్స్‌లో కేవలం ఒరిజినల్ కంటెంట్ ఇచ్చేవాళ్లకి మాత్రమే రెవెన్యూ వచ్చేలా మార్పులు చేసింది. ఇతరుల వీడియోలు కాపీ చేసినవి, ఏఐ జెనరేటెడ్ వీడియోలు, పునరావృతమయ్యేవి, మాస్ ప్రొడ్యూస్డ్ వీడియోలకు ఇక నుంచి ఆదాయం అనేది ఉండదు. ప్రస్తుతం చాలామంది యూట్యూబర్లు ఏఐని వినియోగించి సులభంగా వీడియోలు క్రియెట్ చేస్తున్నారు. ఇతర యూట్యూబర్లు చేసిన వీడియోలలో స్వల్ప మార్పులు చేసి అప్‌లోడ్ చేస్తున్నారు. పాత వీడియోలను మళ్లీ మళ్లీ అప్‌లోడ్ చేస్తున్నారు. ఇలా చేసి ఎక్కువగా వ్యూస్ తెచ్చుకొని డబ్బులు ఆర్జిస్తున్నారు. అందుకే ఇలాంటి వాటిపై యూట్యూబ్ కొరడా ఝళిపించనుంది. ఇకనుంచి ఇలాంటి వీడియోలకు రెవెన్యూ రాదని కొత్తగా రూల్‌ను తీసుకొచ్చింది. ఇలా తప్పులు చేసేవాళ్లకి మానిటైజేషన్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది.
Also read: కర్ణాటకను భయపెడుతున్న గుండెపోటు మరణాలు.. ఆస్పత్రులకు క్యూకట్టిన జనం
AI జనరేటేడ్ వీడియోలపై ప్రభావం
యూట్యూబ్ ఏఐ కంటెంట్‌ను పూర్తిగా నిషేధించలేదు. కానీ.. ఏఐ వాయిస్‌లు, అవతార్‌లు లేదా ఆటోమేటెడ్ స్క్రిప్ట్‌లతో వీడియోలు చేసేవారిపై మాత్రమే ఈ ప్రభావం పడొచ్చు. మొత్తానికి మనిషి సహకారం లేకుండా చేసే ఆటోమేటిక్ వాయిస్, ఏఐ జనరేటేడ్ వీడియోలకు ఈ రూల్స్ వర్తిస్తుంది. రియాక్షన్ వీడియోలపై కూడా ఈ ప్రభావం పడనుంది. అయితే యానిమేటెడ్ అవతార్‌లను వాడే వర్చువల్ యూట్యూబర్స్‌కు ఇది ప్రభావం పడదు. వారు సొంతంగా వాయిస్‌ఓవర్‌లు, రియల్ కంటెంట్‌తో వీడియోలు చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఏఐ జనరేటెడ్ కంటెంట్ పైనే పూర్తిగా ఆధారపడేవారు మాత్రం సమస్యలు ఎదుర్కోక తప్పదు.
Also Read : ఎంత పనిచేశావురా....భార్యను తొక్కి చంపిన భర్త..
క్రియేటర్లు ఏం చేయాలి
యూట్యూబర్లు సొంత కంటెంట్‌పై దృష్టి సారించాలి. కాపీ వీడియోలు, టెంప్లేట్ ఆధారిత వీడియోలు అప్‌లోడ్ చేయకూడదు. అలాగే కంటెంట్ క్రియేషన్ కోసం ఏఐ టూల్స్ వాడేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి. వీడియోలకు ఒరిజినాలిటీ ఉండేలా చూసుకోవాలి. అలాగే క్లిక్‌బైట్ థంబ్‌నెయిల్స్, ఎలాంటి ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్మెంట్ లేని వీడియోలపై కూడా ఈ ప్రభావం పడనుంది.
Also Read: నాకు నోబెల్ బహుమతి రావాలి.. అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
ఈ కొత్త రూల్ టెక్నాలజీ అనేది టైటిల్స్, థంబ్‌నెయిల్స్, రియల్ కంటెంట్‌ను విశ్లేషిస్తాయి. రిపీటీటివ్, కాపీ కంటెంట్‌ను గుర్తిస్తాయి. ఒరిజినల్ కానీ కంటెంట్ వీడియోలను సులభంగా ఫిల్టర్ చేస్తుంది. దీనివల్ల నిజమైన, సొంతంగా క్రియేట్ చేసిన యూట్యూబర్లకు మాత్రమే ప్రయోజనం ఉంటుంది. మొత్తానికి ఒరిజినల్ క్రియేటర్లని ప్రోత్సహించేందుకే యూట్యూబ్ ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చింది.
Also Read : కడుపు తెచ్చుకో..రూ.లక్ష అందుకో..స్కూల్, కాలేజ్ విద్యార్థులకు సంచలన ఆఫర్..ఎక్కడంటే?
telugu-news | rtv-news | youtubers