Population Crisis : కడుపు తెచ్చుకో..రూ.లక్ష అందుకో..స్కూల్, కాలేజ్ విద్యార్థులకు సంచలన ఆఫర్‌..ఎక్కడంటే?

రష్యాలో తీవ్రమైన జనాభా సంక్షోభం ఏర్పడింది.ఈ కారణంగా తన జనాభాను పెంచుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ కనుక గర్భం తెచ్చుకుంటే వారికి ఏకంగా రూ.లక్ష ప్రోత్సాహకాలను అందిస్తామని ప్రకటించింది.

New Update
pregnant scam

Russia Population Crisis

ప్రపంచ వ్యాప్తంగా జనాభాను అరికట్టడానికి చాలా దేశాలు రాయితీలు అందిస్తున్నాయి. ముఖ్యంగా భారత్‌, చైనా వంటి దేశాల్లో జనాభా అధికం. ఆ దేశాల్లో జనాభా పెరుగుదలను అరికట్టడానికి గతంలో అనేక ప్రోత్సహకాలను అందించాయి. అయితే ఆ దేశం మాత్రం తమ దేశ జనాభాను పెంచుకునేందుకు నగదు ప్రోత్సహకాలను ప్రకటించింది. అందులో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ కనుక గర్భం తెచ్చుకుంటే వారికి ఏకంగా రూ.లక్ష ప్రోత్సాహకాలను అందిస్తామని ప్రకటించింది.

Also read: కర్ణాటకను భయపెడుతున్న గుండెపోటు మరణాలు.. ఆస్పత్రులకు క్యూకట్టిన జనం

Russia Population Crisis

 ఇంతకీ ఇలాంటి ప్రకటన చేసింది ఎక్కడ? ఎందుకు? అని ఆలోచిస్తున్నారా? ఎక్కడో కాదు రష్యాలో. అవును రష్యాలో తీవ్రమైన జనాభా సంక్షోభం ఏర్పడింది.ఈ కారణంగా తన జనాభాను పెంచుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. గత దశాబ్దకాలంలో రష్యా జనన రేటులో గణనీయమైన తగ్గుదల, ఉక్రెయిన్ యుద్ధంలో వేలాది మంది యువత మరణం, పెరుగుతున్న వలసల మూలంగా రష్యా జనాభా గణనీయంగా తగ్గిపోయింది.

Also Read: పప్పు బాలేదని తుప్పు రేగొట్టిన ఎమ్మెల్యే.. చొక్కా విప్పి మరీ.. వీడియో వైరల్

రష్యాలో తగ్గుతున్న జనాభాకు అడ్డుకట్ట వేయడానికి గత కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. దీనికోసం అనేక విధానాలను అమలు చేస్తోంది. అందులో ముఖ్యమైంది ప్రజలు, ముఖ్యంగా మహిళలు, త్వరగా పెళ్లి చేసుకుని పిల్లలను కనమని ప్రోత్సహిస్తోంది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి రష్యన్ ప్రభుత్వం అసాధారణమైన విధానానికి తెరలేపింది. మహిళలను, పాఠశాల, కళాశాల విద్యార్థులను గర్భం దాల్చమని ప్రోత్సహించడం ద్వారా జనాభా పెరుగుదలను గణనీయంగా పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది.

Also Read: నితీశ్‌ కుమార్ సంచలన నిర్ణయం.. మహిళలకు 35 శాతం రిజర్వేషన్‌

ఇప్పటికే తగ్గుతున్న జనాభా, జనన రేటును సమతుల్యం చేయడానికి మహిళలు, పెద్ద కుటుంబాల కోసం రష్యా అనేక పథకాలు అమలు చేస్తోంది. వీటిలో అందరి దృష్టిని ఆకర్షించిన పథకం కళాశాల, హైస్కూల్‌ బాలికలు గర్భం దాల్చితే నగదు ప్రోత్సాహకాలు ఇచ్చే పథకం. ఇది కొన్ని ప్రదేశాల్లో మాత్రమే అమలు చేస్తున్నారు. రష్యా సైబీరియాలోని కెమెరోవో, కరేలియా, బ్రయాన్స్క్, ఓరియోల్, టామ్స్క్ వంటి ప్రాంతాల్లో మాత్రమే ఇటువంటి పథకాలు అమలు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని స్కూల్‌ లేదా కాలేజీల్లో చదువుతున్న బాలికలు కనీసం 22 వారాల గర్భవతిగా ఉండి, ప్రభుత్వ ప్రసూతి క్లినిక్‌లో నమోదు చేసుకున్నట్లయితే, వారికి 100,000 రూబిళ్లు (సుమారు ₹ 1 లక్ష) వరకు ఒకేసారి నగదు బోనస్ అందిస్తోందని  ది మాస్కో టైమ్స్, ఫార్చ్యూన్ నివేదిక వెల్లడించింది. రష్యా జనాభా ప్రస్తుతం 146 మిలియన్లు. 1990 ప్రారంభంలో 148 మిలియన్లు ఉండగా, 2100 నాటికి ఇది 74 మిలియన్లకు తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.

Also Read : మామిడి రైతులకు అన్యాయం... ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకే వచ్చా.. జగన్‌ కీలక వ్యాఖ్యలు

pregnant | school-girl-pregnant | school-girl | china-population | world-population | russia

Advertisment
Advertisment
తాజా కథనాలు