Deputy CM Pawan Kalyan: బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కల్యాణ్..బాలుడికి లక్షప్రోత్సాహకం

విజయనగరం జిల్లా అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీ సైకిల్ ను రూపొందించిన ఇంటర్ విద్యార్థి సిద్ధూని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందించారు. బాలుడి సైకిల్ ను నడపడమే కాకుండా..అతనికి రూ. లక్ష ప్రోత్సాహకాన్ని అందజేశారు. 

New Update
cycle

Deputy CM Pawan Kalyan

విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధూ స్వయంగా ఓ సైకిల్ ను తయారు చేశాడు. కాలేజ్ చాలా దూరం ఉండడంతో దాని కోసం ఓ బ్యాటరీ సైకిల్ ను రూపొందించాడు. మూడు గంటలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే.. ఈ సైకిల్ మీద 80 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు. సిద్ధూ తయారు చేసిన ఈ సైకిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరకు వెళ్ళింది. దీంతో ఆయన వెంటనే సిద్ధూను మంగళగిరి కార్యాలయానికి సైకిల్ తో సహా రప్పించుకున్నారు. అతనిని ప్రత్యేకంగా కలిసి మాట్లాడడమే కాకుండా అభినందించారు. దాని తరువాత సిద్ధూను వెనుక కూర్చోబెట్టుకుని అతను రూపొందించిన సైకిల్ ను పవన్ కల్యాణ్ నడిపారు. సైకిల్‌పై సిద్ధూని కూర్చోబెట్టుకొని క్యాంపు కార్యాలయంలో రౌండ్స్ వేశారు. 

రూ. లక్ష ప్రోత్సాహకం..

ఈ సందర్భంగా బ్యాటరీ సైకిల్ గురించి సిద్దూని వివరాలు అడిగి తెలుసుకున్నారు పవన్. సిద్ధూ రూపొందించిన గ్రాసరీ గురూ వాట్సప్ సర్వీస్ బ్రోచర్ చూసి ప్రత్యేకంగా అభినందించారు. సిద్ధూ ఆలోచనలకు మరింత పదునుపెట్టాలని ఆకాంక్షిస్తూ.. రూ.లక్ష ప్రోత్సాహకం అందించారు. అని తెలివి తేటలకు ఆశ్చర్యపోయిన డిప్యూటీ సీఎం సిధ్థూని కౌగలించుకుని మరీ అభినందించారు.  

Also Read: PM Modi: ప్రధాని మోదీకి స్టాండింగ్ ఓవేషన్..ఎక్కడో తెలుసా..

Advertisment
Advertisment
తాజా కథనాలు