/rtv/media/media_files/2025/07/09/amit-shah-2025-07-09-21-33-06.jpg)
Amit Shah
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక విషయం వెల్లడించారు. తాను రాజకీయాల నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్నాక భవిష్యత్ ప్లాన్‌పై స్పష్టత ఇచ్చారు. వేదాలు, ఉపనిషత్తులు చదువుతానని తెలిపారు. అలాగే ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెడతానని తెలిపారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల సహకార సంఘాల మహిళలతో మాట్లాడారు. '' పదవీ విరమణ తర్వాత వేదాలు, ఉపనిషత్తులు చదువుతాను. ప్రకృతి వ్యవసాయానికే సమయం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నాను.
Also Read: కడుపు తెచ్చుకో..రూ.లక్ష అందుకో..స్కూల్, కాలేజ్ విద్యార్థులకు సంచలన ఆఫర్..ఎక్కడంటే?
రసాయన ఎరువులు వాడి పండించే పంటల వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. అలాగే వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుంది. సహకార శాఖ మంత్రిగా నా ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంది.
Also Read: గుంటనక్క టర్కీపై భారత్ రివేంజ్.. ఆ దేశంపైకి మన మిస్సైళ్లు!
నాకు కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు చాలామంది కీలకమైన శాఖ ఇచ్చారని అన్నారు. కానీ సహకార మంత్రి బాధ్యతలు అప్పగించినప్పుడు హోంశాఖ కంటే పెద్ద శాఖ ఇచ్చారని నేను భావించాను. ఎందుకోసం ఈ శాఖ అనేది దేశంలోని రైతులు, పేదలు, గ్రామాలు, పశు సంపద కోసం పనిచేస్తుందని'' అమిత్ షా అన్నారు.
Also Read: 26 ఏళ్ళుగా పరారీ.. ఎట్టకేలకు సీబీఐ కస్టడీకి ఆర్థిక నేరస్థురాలు మోనికా కపూర్