/rtv/media/media_files/2025/01/21/mkyxp5h3FHxdD2efW1eU.jpg)
Kaleshwaram project Photograph: (Kaleshwaram project )
గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ వస్తున్నది. దీనిపై విచారణ చేయడానికి రిటైర్డ్ జడ్డి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కాగా ఈ కమిషన్ గడచిన 15 నెలలుగా విచారణ చేసి తుదినివేదికను నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు కు అందజేశారు. కాగా ఈ మేరకు ఆ నివేదికను ఈ రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు సీఎం రేవంత్ బేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు కాళేశ్వరం కమిషన్ నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు. కాగా, నివేదికలోని కీలక అంశాలపై ముఖ్యమంత్రితో పాటు మంత్రులు చర్చిస్తున్నారు. నిన్న నివేదిక అందిన తరవాత ఉన్నతాధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితం నివేదికతో సీఎంను కలిసిన ఉత్తమ్, సీఎస్ రామకృష్ణరావు సీఎంతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై వీరంతా చర్చించారు.
Also Read : రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక
CM Revanth Reddy Receives Kaleshwaram Report
కాళేశ్వరం కమిషన్, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ప్రశాంత్ పాటిల్ వ్యవహరించినట్లు తెలిపారు. 2023లో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లోనూ సమస్యలు తలెత్తయి. దీంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది. దీనికోసం గతేడాది మార్చిలో పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. 15నెలల పాటు కమిషన్ బ్యారేజీలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఇందులో భాగమైన115 మందిని విచారించింది. దానిద్వారా నివేదికను తయారు చేసింది. దీంతో ఆ నివేదికలో ఏం ఉంది అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా నివేదిక ముఖ్యమంత్రికి చేరడంతో ఆయన తీసుకోబోయే నిర్ణయం పై ఉత్కంఠ నెలకొంది.
నివేదికలో ఏముంది?
కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో పలు అవకతవకలు జరిగినట్లు కమిషన్ తన నివేదికలో వెల్లడించింది. దీనికి కిందిస్థాయినుంచి పై స్థాయి వరకు పలువురి ప్రమేయం ఉందని నివేదికలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ స్పష్టం చేసినట్లు తెలిసింది. వ్యవస్థలు కాకుండా వ్యక్తుల ఇష్టానుసారం పనులు జరిగాయని, ఉన్నత స్థాయిలో వచ్చిన ఒత్తిడులకు లొంగి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకొన్నారని నివేదిక వెల్లడించింది. నిర్మాణంలో అనేక ఆర్థిక అవకతవకలు జరిగాయని...కాళేశ్వరం కమిషన్ పేర్కొన్నట్లు సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి కూడా పలు ఇంట్రస్టింగ్ వివరాలను నివేదికలో పేర్కొ్న్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకునే చర్యలపై సర్వతా ఉత్కంఠ నెలకొన్నది.
ఈ నెల 4న క్యాబినెట్ సమావేశం
కాగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీలో నీటిపారుదల శాఖ కార్యదర్శి,సభ్యులుగా న్యాయశాఖ కార్యదర్శి, జీఏడీ కార్యదర్శిని నియమించింది. కాగా నివేదికపై చర్చించడానికి ఈ నెల 4న తెలంగాణ క్యాబినెట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశంలో తర్వాత తీసుకోబోయే చర్యలపై చర్చించే అవకాశం ఉంది.
Also Read : రంగారెడ్డి జిల్లాలో దారుణం.. 40 ఏళ్ల వ్యక్తితో బాలికకు వివాహం!
cm-revanth-reddy | Kaleshwaram Commission | kaleshwaram case updates | kaleshwaram commission inquiry | kaleshwaram barrage