Ropeways In Hyderabad : హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్..ఇక గాలిలో తేలిపోవాల్సిందే...

నగరంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రిస్తూ టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఉమ్టా అధికారులు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిలో భాగంగా నగరంలోని టూరిస్టు ప్రాంతాల్లో రోప్​ వేలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

New Update
Ropeway in Hyderabad

Ropeway in Hyderabad

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రిస్తూ టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా యూనిఫైడ్ మెట్రో పాలిటన్ ట్రాన్స్ ఫోర్టు అథారిటీ (ఉమ్టా) అధికారులు ప్రభుత్వం ముందు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిలో భాగంగా పర్యాటక శాఖతో కలిసి నగరంలోని టూరిస్టు ప్రాంతాల్లో రోప్​ వేలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అంటే ఇక మీదట ఆకాశ మార్గంలో ప్రయాణించడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీనిప్రకారం హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్..రోప్వేలు వస్తున్నయ్.. టూరిజాన్ని అభివృద్ది చేస్తాం.భూమినుంచి కొంత ఎత్తులో ప్రత్యేకంగా తీగలను ఏర్పాటు చేసి ఒక బాక్స్ లాంటి వాహనంలో ఒక ప్రాంతం నుంచ మరో ప్రాంతానికి వెళ్లేలా రోప్ వేలను ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ భావిస్తోంది. 

ఇది కూడా చదవండి: సృష్టి కేసులో సంచలనం..సరోగసి చేయకున్న చేసినట్లు నమ్మించాం...డాక్టర్ నమ్రత వాంగ్మూలం

Ropeways In Hyderabad

దీనికి సంబంధించి ఉమ్టా ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు తెలిపింది. ఆకాశ మార్గంలో ప్రయాణించే ఈ రోప్ వేలో ఒక బాక్ ఉంటుంది. ఈ బాక్స్ లో ఒకే సారి నలుగురు, ఆరుగులు ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో పాటు నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు దోహడపడుతుందని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ట్రాఫిక్ సమస్యను అరికట్టడం, విదేశీయులను, పర్యాటకులను ఆకర్శించడానికి కూడి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.ఇప్పటికే ఉమ్టా ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. గతంలోనూ ఈప్రాజెక్టుపై చర్చ జరిగినా అమల్లోకి రాలేదు. తాజాగా నగరం విస్తరిస్తుండడం, పర్యాటకుల సంఖ్య భారీగా పెరగడంతో మళ్లీ ఈ ప్రతిపాదన మరోసారి తెరపైకి  వచ్చింది.

రోప్​ వే ప్రాజెక్టులో భాగంగా తొలుత పర్యాటక ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. దీనికోసం ప్రయోగాత్మకంగా ముందు గోల్కొండ–కుతుబ్ షాహి టూంబ్స్​ మధ్య రోప్ వేను నిర్మించాలని భావిస్తున్నారు. రాష్ర్టంలోని పలు చారిత్రక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలకు రోజూ వందలాదిగా పర్యాటకులు విదేశీయులు వస్తుంటారు. దీంతో ఆ ప్రాంతాల్లోను ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్​ ఎక్కువగానే ఉండడం వల్ల ఇక్కడ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ఈ ప్రాంతంలో తొలి రోప్ వేను నిర్మంచాలని ప్రతిపాదించారు. దీనివల్ల తక్కువ సమయంలో కాశ మార్గాన గోల్కొండ–కుతుబ్ షాహి టూంబ్స్​ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే, ఇక్కడ మిలిటరీ ప్రాంతం అయిన కంటోన్ మెంట్‌ ఉండడం వల్ల అలైన్ మెంట్​ఎక్కడి నుంచి తీసుకోవాలన్న దానిపై అధికారులు చర్చిస్తున్నారు. ఈ ప్రాజెక్టు సక్సెస్​అయితే, సంజీవయ్య పార్కు, ట్యాంక్‌ బాండ్​, మీరాలం ట్యాంక్​, కొత్వాల్​ గూడ  వద్ద నిర్మించిన ఎకో పార్క్ వద్ద కూడా ఈ రోప్ వేలను నిర్మించాలని పర్యాటక శాఖ ఆలోచన చేస్తుంది.

Also Read: తెలంగాణ మహిళలకు బంపరాఫర్.. ఉచిత బస్సు ట్రైనింగ్

heavy-traffic-in-hyderabad | ghmc-traffic | Tourist Places | tourist-place | hydrabad | latest-telugu-news | telugu-news | latest telangana news

Advertisment
తాజా కథనాలు