Komatireddy Rajagopal Reddy : కొండా సురేఖ వివాదం వేళ.. కాంగ్రెస్ పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

"జన్మతః నేను కాంగ్రెస్ పార్టీ, పుట్టిన నాటి నుండి నా రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది,కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా..ఆస్తుల అమ్ముకొని పార్టీని బ్రతికించడానికి పనిచేసిన' అంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి  సంచలన ప్రకటన చేశారు.

New Update
Komatireddy Rajagopal Reddy

Komatireddy Rajagopal Reddy

Komatireddy Rajagopal Reddy :  "జన్మతః నేను కాంగ్రెస్ పార్టీ, పుట్టిన నాటి నుండి నా రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది,కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా..ఆస్తుల అమ్ముకొని పార్టీని బ్రతికించడానికి పనిచేసిన' అంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి  సంచలన ప్రకటన చేశారు. మునుగోడు లో డీసీసీ అధ్యక్షుడి ఎంపిక పై అభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి ఎక్కడ చెయ్యి చాప లేదు. కష్టకాలంలో కమిట్ మెంట్‌తో కాంగ్రెస్ పార్టీ జెండాను బతికించే విధంగా పనిచేసిన వాన్ని. రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న మునుగోడు వెనకబడే ఉంది. అని ఆయన వాపోయారు.  దశాబ్దాలుగా మునుగోడు లో అభివృద్ధి జరగకుండా అన్యాయం జరిగింది. ఇప్పటికి ఇంకా అన్యాయం జరుగుతూనే ఉందని రాజగోపాల్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎఐసీసీ పెద్దలు ఎవరిని డీసీసీ అధ్యక్షులు గా ఎంపిక చేసిన  మాకు అభ్యంతరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఈ సందర్భంగా  డీసీసీ అధ్యక్షులు గా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీ ఎవరిని ఎంపిక చేసిన మద్దతిస్తామని, రాజ్ గోపాల్ రెడ్డికి అధిష్టానం ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోవాలని సమావేశం  ఏకవాఖ్య తీర్మానం చేసింది.  

ఈ సందర్భంగా ఏఐసీసీ మాజీ జనరల్ సెక్రటరీ బిశ్వరంజన్ మహంతి మాట్లాడుతూ నల్గొండ జిల్లా కాంగ్రెస్ వల్లనే రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయిందని,  రాజగోపాల్ రెడ్డి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేరున్న నేత,  ఆయన స్థాయి కి మంత్రి పదవనేది తక్కువే, అంతకు మించిన కేపాసిటీ ఉన్న నేత  అని అభిప్రాయపడ్డారు. మీ ఓపికకు తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అధిష్టానానికి మీ ఆవేదనను మీ కోరికను తెలియజేస్తాను. నేను తిరిగిన ఏ నియోజకవర్గంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీపై ఉన్నంత ప్రేమ ఎక్కడ కూడా చూడలేదని ఆయన అన్నారు.ఎమ్మెల్సీ శంకర్‌ నాయక్‌ మాట్లాడుతూ  తెలంగాణలో క్రేజీ ఫాలోయింగ్ ఉన్న లీడర్ రాజగోపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు కోరికను రాహుల్ గాంధీ దృష్టికి  తీసుకెళ్తామన్నారు.  ఈ సమావేశంలో ఎఐసిసి మాజీ జనరల్ సెక్రెటరీ బిశ్వరంజన్ మహంతితోపాటు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, పీసీసీపరిశీలకులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, నియోజకవర్గ వ్యాప్త ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఇది కూడా చూడండి: Konda Surekha: మంత్రి ఇంటి దగ్గర ఫుల్ డ్రామా...పోలీసుల ఎదురుగానే ఒకే కారులో వెళ్ళిన సురేఖ, సుమంత్

Advertisment
తాజా కథనాలు