తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగిపోతుంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌లో 6.1 డిగ్రీలు, కామారెడ్డి డోంగ్లీలో 6.8 డిగ్రీలు, వికారాబాద్‌లో 7.8 డిగ్రీలు, మెదక్ జిల్లా బోడగాట్‌లో 8.4 డిగ్రీలు నమోదయ్యాయి. ఇది కూడా చూడండి: TS: గ్రామ సభల్లో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ఈ జిల్లాల్లో ఎక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు.. వీటితో పాటు మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్‌లో 8.4, నిర్మల్‌లో8.8, సిద్దిపేటలో 9.2, రాజన్న సిరిసిల్లలో 9.5, మేడ్చల్ మల్కాజిగిరి ఉప్పల్‌లో 9.5, జయశంకర్ భూపలపల్లిలో 9.8, ములుగు జిల్లా గోవిందరావుపేటలో 9.9, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 10 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ జిల్లాలో కాకుండా మిగతా జిల్లాలో 10 నుంచి 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది కూడా చూడండి:AP: డాకూ మహరాజ్ టికెట్ల పెంపుకు అనుమతి ఇక ఏపీ విషయానికొస్తే.. ఏజెన్సీ ప్రాంతాల్లో జీరో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా, లంబసింగి, అరకు ప్రాంతాల్లో 0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జి.మాడుగులలో 8.3 డిగ్రీలు, చింతపల్లిలో 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇది కూడా చూడండి: SBI Clerk Notification 2025: SBIలో 14 వేల క్లర్క్ ఉద్యోగాలు.. మూడు రోజులే ఛాన్స్! #Lambasingi, the "Kashmir of #AndhraPradesh," is a serene hill station in Visakhapatnam.Known for its chilly winters, it"s the only place in South India to see snowfall.Surrounded by lush forests and coffee plantations, it"s a paradise for nature lovers.#NewYear2025 pic.twitter.com/qRptPWk1zT — The Travel People (@Travelpeople09) January 1, 2025 ఇది కూడా చూడండి: HYD: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు