TS:  గ్రామ సభల్లో రేషన్‌ కార్డుల దరఖాస్తుల స్వీకరణ

అర్హులైన వారందరికీ తెలంగాణ గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ నెల 26 నుంచి వాటిని జారీ చేయనుంది. ఈలోపు రేషన్ కార్డులు కావాలనుకునే వారి దగ్గర గ్రామసభల్లో, బస్తీ సభల్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26 నుంచి అర్హులైన వారందరికీ కార్డులు అందించనుంది ప్రభుత్వం. మొదట కొత్త కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించిన రూల్స్‌ను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటంచనున్నారు. అయితే రేషన్ కార్డలకు సంబంధించిన దరఖాస్తులను ఈనె ల15వ తేదీ నుంచి స్వీకరిస్తామని ప్రభుత్వం చెప్పింది. అర్హత నింబధనల్లో ఎటువంటి మార్పు ఉండదని క్లియర్ చేసింది. 2014లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోను యథాతధంగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. 

గ్రామ, బస్తీ సభలు..

కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పటిలానే ఆన్ లైన్‌లో  దరఖాస్తు చేసుకోవచ్చును. ఇవి మీ సేవలో చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటూ ఇప్పుడు కొత్తగా దరఖాస్తుల స్వీకరణ కోస గ్రామ సభలు, బస్తీ సభలను కూడా నిర్వహించనున్నారు. అక్కడ కలెక్ట్ చేసిన వాటిని డిజిటలైజ్ చేసి...అర్హులైన వారందరికీ 26వ తేదీ నుంచి కార్డులను అందించనున్నారు. గతంలో రేషన్‌ కార్డులను ఎలక్ట్రానిక్‌ రూపంలో జారీ చేశారు. కానీ ఇప్పుడు వాటిని రీడిజైన్‌ చేసి... ఫిజికల్‌ కార్డులుగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కొత్త కార్డులు జారీ అయ్యాక ఇప్పటికే ఉన్న రేషర్ కార్డుల విషయంలో కూడా మార్పులు చేయనున్నారు. ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని వచ్చిన దరఖాస్తులను ఆమోదిస్తామని ప్రభుత్వం తెలిపింది. పెళ్ళయిన మహిళలు,  పిల్లల పేర్లు చేర్చాలని 12 లక్షలకు పైగా దరఖాస్తులు ఆల్‌రెడీ వచ్చి ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు పరిశీలించనున్నారు. 

Also Read: AP: డాకూ మహరాజ్ టికెట్ల పెంపుకు అనుమతి

Advertisment
తాజా కథనాలు