SBI Clerk Notification 2025: SBIలో 14 వేల క్లర్క్ ఉద్యోగాలు.. మూడు రోజులే ఛాన్స్!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. 14,191 క్లర్క్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏపీలో 50, తెలంగాణలో 342 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు మరో మూడు రోజులే ఛాన్స్ ఉంది. జనవరి 7తో గడువు ముగుస్తుంది.

New Update
SBI Clerk Notification 2025

SBI Clerk Notification 2025

నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వేలల్లో ఖాళీల భర్తీకి ప్రకటన వదిలి నిరుద్యోగులకు ట్రీట్ అందించింది. దాదాపు 14,191 క్లర్క్ (జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

డిగ్రీ అర్హతతో అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ మొత్తం ఖాళీల్లో తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణలో ఎక్కువగా పోస్టులు ఉన్నాయి. అందులో ఏపీలో 50, తెలంగాణలో 342 ఖాళీలు ఉన్నాయి. 

విద్యార్హత:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

వయస్సు:

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3ఏళ్లు, పిడబ్ల్యూబిడీ అభ్యర్థులకు 10ఏళ్ల వరకు వయోపరిమితితో సడలింపు ఉంటుంది. 

ఎంపిక:

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమినరీ ఎక్జామ్ అండ్ మెయిన్ ఎక్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. 

పరీక్ష కేంద్రాలు: 

ఏపీ: గుంటూరు, అనంతపురం, విజయవాడ, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, కడప, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 

తెలంగాణ: హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌లో ఏర్పాటు చేయనున్నారు. 

దరఖాస్తు తేదీ: డిసెంబర్ 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. జనవరి 7 వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవాడనికి ఈ లింక్ క్లిక్ చేయండి.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు