తెలంగాణలో హైడ్రా తన పనులు తాను చేసుకుంటూ పోతోంది. గవర్నమెంట్ అండతో హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది. ఈరోజు మాదాపూర్ లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అక్కడ అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మిస్తున్న బిల్డింగ్ కూల్చేశారు హైడ్రా అధికారులు. జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా నిర్మిస్తున్న బిల్డింగ్ ను కూల్చేశామని హైడ్రా అధికారులు చెప్పారు.
రూల్స్ ప్రకారం లేదు..
రూల్స్ పట్టించుకోకుండా ఉన్న ఏ నిర్మాణాన్నైనా కూల్చేస్తామని హైడ్రా అధికారులు ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. అయినా కూడా కొంతమంది వాటిని పెడ చెవిన పెడుతున్నారు. ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో నిర్మించిన భవం కూడా రూల్స్‌ను అతిక్రమించి కట్టినదే. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్, గ్రౌండ్ తో పాటూ 5 అంతస్తు భవనాన్ని నిర్మిస్తున్నారని అక్కడ స్థానికులు హైడ్రాకు కంప్లైంట్ చేశారు. ఫిర్యాదుల మేరకు బిల్డింగ్‌ను పరిశీలించిన అధికారులు దాన్ని కూలగొట్టారు. అక్రమ కట్టడమని హైకోర్టు నిర్ధారించినప్పటికీ.. కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా భవనాన్ని నిర్మిస్తున్నట్లు గుర్తించామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైకోర్టు ఆర్డర్ ఆధారంగా గతేడాది మార్చ్ లో బిల్డింగ్ కొంతభాగాన్ని కూల్చేశామని తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు.
Also Read: ప్రతి సోమవారం హైడ్రా ప్రజావాణి.. ఈ నంబర్లకు కాల్ చేయండి!