/rtv/media/media_files/2025/07/19/insta-reels-2025-07-19-15-42-17.jpg)
ఫ్యామిలీ అంతా ఇంట్లో కూర్చొని సరదాగా గడుపుతున్నారు. 8 ఏళ్ల చిన్నారి ఆన్‌లైన్‌లో రీల్స్ చూస్తోంది. నా కోసం రెండు చుక్కలు కార్చే మొగడే లేడా.. అని స్టాండప్ కామెడీ షోలో ఓ లేడీ అంటోంది. ఇది విన్న ఆ చిన్నారి నాన్న షాక్ అయ్యాడు. వెంటనే ఫోన్ తీసుకుని ఇక మీదట ఇన్స్టాగ్రామ్ చూడొద్దంటూ ఆ చిన్నారికి చెప్పాడు. మరుసటి రోజు బస్‌లో ఆఫీస్‌కు వెళ్తుండగా మళ్లీ అదే వాయిస్ వినిపించింది. అతని పక్కన కూర్చున్న వ్యక్తి ఫోన్లో నుంచి అది వచ్చిందని అతనికి అర్థం అయ్యింది. ఆ వీడియోలో ఓ మహిళ ఇలా అంటోంది.. కట్నం తీసుకున్న నా భర్త దగ్గరి నుంచి రోజూ రాత్రికి రూ.2వేలు తీసుకుంటాను. ఆఫీస్ బ్రేక్ మధ్యలో అతను సరదాగా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేశాడు. కొలీగ్ నెంబర్ అడిగితే రూ.50వేలు ఇస్తే ఓయోకి వస్తా అని ఓ లేడీ అంటున్న స్టాండప్ వీడియో ప్లే అయ్యింది. దీంతో షాక్ అయ్యాడు ఆ వ్యక్తి. ఇది ఆ ఒక్కని అనుభవమే కాదు.. ఇలా షాకైన వారు వేలు, లక్షల సంఖ్యలో ఉంటారు.
Also Read : సిగ్గులేని టాలీవుడ్.. అంత్యక్రియలకు ఒక్కడు రాలే
అసలు ఏం జరుతోంది
ఇటీవల కాలంలో ఫోన్ ఓపెన్ చేస్తే చాలు డబుల్ మీనింగ్ డైలాంగ్‌లు, బూతు మాటలతో వందలాది వీడియోలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అచ్చా ఎఫ్ఎం అనే ఓ ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసి AIతో అమ్మాయిలు బూతులు మాట్లాడుతున్నట్లు ఓ వీడియోలు వదులుతున్నారు. పచ్చి బూతులు ఉన్న ఆ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు టెక్కీలు కాసులకు కక్కుర్తి ఏఐ టెక్నాలజీ అసభ్యకరమై పదజాలాన్ని ఉపయోగిస్తూ వీడియోలు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చూస్తున్నారు. సగం సగం బట్టలతో ఏఐ ఉపయోగించి లేడీస్ ఫేస్‌లు క్రియేట్ చేస్తున్నారు. అచ్చం మనిషే అలా మాట్లాడుతున్నట్లు ఉంటుంది. అవి ఏఐ వీడియోస్ అని అంత ఈజీగా కనిపెట్టలేరు. ఈ వీడియోలకు కోట్ల కొద్దీ వ్యూస్ వస్తుండడంతో ఇలాంటి మరికొన్ని ఖాతాలు పుట్టుకొచ్చాయి.
Also Read : ఉక్రెయిన్‌పై భీకర దాడులు.. 300కుపైగా డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా
ఓపెన్ చేస్తే బూతు పురాణం
నా కోసం రెండు చుక్కలు కార్చే మోగాడే లేడా, సగం సగం బట్టలు వేసుకొని బాడీ కౌంట్, కట్నం తీజుకున్న భార్త దగ్గర రాత్రి రోజుకూ రూ.2వేలు తీసుకుంటా, ఓయోకి రావాలంటే రూ.50వేలు, నా ఎక్స్ లవర్‌తో ఓ రాత్రి గడుపుతా, శోభనం అనాలి ఫస్ట్ నైట్ అనవద్దు అని ఇవన్నీ అలాంటి వీడియోల్లో బూతు జోకులు. సోషల్ మీడియాలో అసభ్య కంటెంట్, రీల్స్, వీడియోస్ పోస్ట్ చేసి కొందరు భారీగా సంపాధిస్తున్నారు. తద్వారా సోషల్ మీడియా మొత్తం బూతు మాటలతో నింపి.. చిన్నారుల మెదళ్లను కలుషితం చేస్తున్నారు. పూర్తిగా వారిని తప్పుదారిలోకి నెడుతున్నారు.
Also Read : ‘హరి హర వీరమల్లు’ టికెట్ ధరలు పెంపు
ఇలా రీల్స్ చేస్తే అరెస్ట్
అయితే.. ఇలాంటి వీడియోలు కొన్ని రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోనూ చక్కర్లు కొట్టాయి. వీటిని క్రియేట్ చేస్తున్న ముగ్గురితోపాటు ఓ వ్యక్తిని జూలై 15న సంభాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. ఏఐతో కాకుండా నేరుగానే ఆ వీడియోలను చేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ పోస్ట్ చేసి వారు నెలకు రూ.25 నుంచి రూ.30వేలు సంపాధిస్తున్నట్లు తేలింది. ఓ అకౌంట్ క్రియేట్ చేసి అందులో అశ్లీల కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. అస్మోలి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన సమాచారం మేరకు అరెస్టులు జరిగాయని పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) కృష్ణ కుమార్ బిష్ణోయ్ తెలిపారు. ఆ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మెహ్రుల్ నిషా అలియాస్ పారి, మెహక్, హీనాగా గుర్తించిన ముగ్గురు మహిళలు నిర్వహిస్తున్నారు. వారు బూతులు, డబుల్ మీనింగ్ డైలాంగ్స్, అభ్యంతరకరమైన మాటలతో వీడియో కంటెంట్ చేసి అప్‌లోడ్ చేస్తున్నారు. ఆయా వీడియోలు ఆన్‌లైన్‌లో వేగంగా వైరల్ అవుతున్నాయి.
Also Read : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెగిపడిన మహిళ తల!
BNS 296(B), IT చట్టంలోని 67 సెక్షన్ల కింద కేసు
ఆదివారం వారి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై చర్య తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. పోలీసులు వారిపై అస్మోలి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. BNS సెక్షన్ 296(B), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేయబడింది. కోర్టు ఆదేశాలను అనుసరించి పోలీసులు కఠిన చర్యలు తీసుకుని నలుగురు నిందితులను జైలుకు పంపారు. వారికి 3 నెలలు జైలు శిక్ష లేదా రూ.1000 జరిమానా విధించారు. ఇదే తరహా చర్చలను ఇక్కడి పోలీసులు కూడా తీసుకోవాలని నెటిజెన్లు కోరుతున్నారు. అసలు ఇలాంటి కంటెంట్ ను నియంత్రించడానికి కఠినమైన గైడ్ లైన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కేసు పెడితే మూడు నెలలు జైల్లో
అయితే.. ఎవరైనా ఇలాంటి కంటెంట్ పై కేసులు పెడితే క్రియేట్ చేసిన వారు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. BNS సెక్షన్ 296(B), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు చట్టప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తారని హెచ్చరిస్తున్నారు.
ai-video | Indecent videos | Instagram reels | viral-videos | arrest | police-cases | social media reels | latest-telugu-news