Fish Venkat: సిగ్గులేని టాలీవుడ్.. అంత్యక్రియలకు ఒక్కడు రాలే

ఫిష్ వెంకట్ మృతిపై సోషల్ మీడియాలో టాలీవుడ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల రెమున్యరేషన్ తీసుకునే హీరోలు, డైరెక్టర్లు, రూ.50 లక్షలు సాయం చేయలేకపోయారంటూ తిడుతున్నారు. కనీసం చనిపోయాక కుటుంబాన్ని పరాపర్శించడానికి కూడా సినీ పెద్దలు రాకపోవడం భాదాకరం.

New Update
Fish venkat

ఒక్క కాకి చనిపోతే వందల కాకులు వస్తాయి, ఓ కోతి గాయపడితే వంద కోతులు వస్తాయి. జంతువుల్లోనే ఇంత ఐకమత్యం ఉంటే.. మనుషులమైన మనం, అందులోనూ ఒకే రంగానికి చెందిన వ్యక్తులు ఇంకెలా ఉండాలి. చెప్పేది ఎవరి గురించి అనుకుంటున్నారా.. మన అభిమాన తారలు, సినీ హీరోలు, దర్శకనిర్మాతలు. వీళ్లంతా ఏదో ప్రజాసేవ చేస్తున్నట్లు వీళ్లు వేలల్లో ఫ్యాన్స్ ఉంటారు. సినిమాల్లో మాత్రమే వారంతా హీరోలు బయట జీరోలు అని మరో సారి నిరూపించుకున్నారు. ఫిష్ వెంకట్ అనే యాక్టర్ నెల రోజులపాటు హాస్పటల్‌లో ప్రాణాలతో పోరాడాడు. రెండు కిడ్నీలు పాడై ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. జూలై 18న రాత్రి (శుక్రవారం) కన్నుమూశారు. ఆయన ఇంటిముందు మ‌ృ‌తదేహం పెట్టడానికి చోటు కూడా లేక రోడ్డుపై పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన కుటుంబం ఎంత పేదరికంలో ఉందో. ఫిష్ వెంకట్ ఫ్యామిలీని పరామర్శించడానికి ఏ ఒక్క హీరో, డైరెక్టర్, నిర్మాత కూడా రాలేదు. 

Also Read :  నా చావుకు తిరువూరు ఎమ్మెల్యే కొలి కపూడి శ్రీనివాసరావే కారణం...ఇరిగేషన్ ఏఈఈ లేఖ వైరల్

అంత్యక్రియలకు రాని సినీ ప్రముఖులు..

నిజానికి ఆయన చనిపోలేదు. ఆయన ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోని కొందరు ప్రముఖులు ముందుకు వచ్చి ఉంటే ఆయన బతికి ఉండే వాడు. ఫిష్ వెంకట్ వైద్యం కోసం రూ.50 లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పారు. దాదాపు నెల రోజులపాటు ఫిష్ వెంకట్ కుటుంబం ఆర్థిక సాయం కోసం ఎదురు చూసింది. టాలీవుడ్‌లో ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేస్తే ఆయన బతుకుతారని ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యలు వేడుకున్నారు. ఆయన ఎన్నో సినిమాల్లో విలన్ క్యారెక్టర్‌లో నటించారు. సినిమాలో కోట్లు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలు ఒక్క రూ.50 లక్షలు ఫిష్ వెంకట్‌కు సాయం చేయలేక పోయారు. వందలు, వేలల్లో టాలీవుడ్ యాక్టర్లు ఉన్నారు. అందులో ఓ 50 మంది ముందుకు వచ్చి తలో రూ.లక్ష సాయం చేసినా ఆయన బతికి ఉండేవారని వాదనలు ఇప్పడు వినిపిస్తున్నారు. 

Also Read :  ఉరిశిక్ష రద్దు.. నిమిష ప్రియ విడుదల!

100పైగా సినిమాల్లో స్టార్ హీరోస్‌తో ఫిష్‌ వెంకట్‌

పెద్ద సినిమాలు విడుదలైతే టికెట్ల రేట్లు పెంచి మరీ ఫ్యాన్స్ రక్తాన్ని పీల్చుతారు సినీరంగ ప్రముఖులు. డబ్బున్న వ్యక్తులు, ఒక్కరోజు అరెస్ట్ అయితే క్యూలో వెళ్లి మరీ పరామర్శిస్తారు. కానీ చిన్న స్థాయిలో ఉన్న ఓ సాధారణ యాక్టర్‌ని చావు వెంటాడుతుంది అంటే ఎవరూ పట్టించుకోలేదు. వందకుపైగా సినిమాల్లో ఎంతోమంది సీనియర్‌ యాక్టర్స్‌తో ఫిష్‌ వెంకట్‌ నటించారు. కానీ ఆయన మృతిపై ఒక్కరూ కూడా ఇప్పటివరకు స్పందించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మృతిని టాలీవుడ్‌ పట్టించుకోకపోవడం మరింత బాధకరంగా మారింది. తామంతా టాలీవుడ్ ఫ్యామిలీ అని చెప్పుకునే వారు ఇప్పుడు మ‌ృదేహాన్ని కూడా చూడడానికి రాలే.

Also Read :  మరో దారుణం.. బావతో కలిసి భర్తను చంపిన భార్య

ఆ సినిమాలో ‘ఒక్కసారి తొడకొట్టు చిన్నా’

ఎన్నో సినిమాల్లో తనదైన శైలి కామెడీతో అలరించి.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్‌ వెంకట్‌. ముఖ్యంగా హైదరాబాద్ యాసలో నవ్వులు పూయించారు. విలన్స్ గ్యాంగ్ లో కమెడియన్ గా రాణించారు. పెద్ద పెద్ద నటులతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్, అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్ వంటి స్టార్‌ హీరోస్‌ సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. 2002లో ఆది సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఫిష్‌ వెంకట్‌.. ఆ సినిమాలో ఒక్కసారి తొడకొట్టు చిన్నా అనే డైలాగ్‌తో ఫేమస్‌ అయ్యారు. దీంతో అప్పటినుంచి తెలుగు ఇండస్ట్రీలో ఆయన పేరు మార్మోగింది. ఆ తర్వాత వీవీ వినాయక్‌ డైరెక్షన్‌లో చాలా సినిమాల్లో నటించారు. 

Also Read :  మందుబాబులకు షాక్‌.. ఓఆర్‌ఆర్‌ లోపల ఆ దుఖాణాలు బంద్‌... కానీ

కేవలం గబ్బర్‌ సింగ్‌ గ్యాంగ్‌, హీరో విశ్వక్‌ సేన్‌

ఇలా ఎన్నో సినిమాల్లో నటించిన ఫిష్‌ వెంకట్‌కు.. కష్టసమయాల్లో టాలీవుడ్‌ ఆసరాగా నిల్వలేకపోయింది. కిడ్నీ సమస్యతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన వెంకట్ కు డయాలసిస్ ట్రీట్ మెంట్ జరిగింది. అయితే కిడ్నీల మార్పిడి ఆపరేషన్ చేయాల్సి ఉండగా.. అందుకు కావాల్సిన ఖర్చు కోసం వెంకట్‌ కుటుంబ సభ్యులు దాతల సాయం కోరారు. కానీ టాలీవుడ్‌ నుంచి ఫిష్‌ వెంకట్‌కు సహాయం అందలేదు. కేవలం గబ్బర్‌ సింగ్‌ గ్యాంగ్‌, హీరో విశ్వక్‌ సేన్‌ వంటి పలువురు తమవంతు ఆర్థిక సాయం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రెండు లక్షల వరకు సాయం అందించారు. కానీ మిగతవారెవరూ ఆయన్ను పట్టించుకోలేదు. కనీసం ఆయన చనిపోయినప్పుడు కూడా చివరిచూపునకు ఏ ఒక్క హీరో వెళ్లలేదు. కుటుంబ సభ్యులనూ పరామర్శించలేదు.

అంత్యక్రియలకు రాని సినిప్రముఖులు

ఇటీవలే కోటా శ్రీనివాసరావు చనిపోయినప్పుడు ఎంతోమంది సీనియర్ నటులు స్పందించారు. కానీ ఇప్పుడు ఫిష్ వెంకట్ మృతిని టాలీవుడ్ పెద్దలు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చావు విషయంలో ఎవరైనా ఒకటే అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

fish venkat | comedian fish venkat | fish venkat 50 Lakhs | fish venkat family | Fish Venkat hospital | fish venkat passed away | fish venkat news | tollywood | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు