/rtv/media/media_files/2025/02/15/fNo7zzxPZltuiqICRPY0.webp)
Ambedkar Konaseema Crime News
అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్నంపల్లి టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం ముమ్మిడివరం నుంచి రావులపాలెం దిశగా వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనము అదుపుతప్పి ముందుకు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ రోడ్డుపై పడిపోవడంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న ట్రాక్టరు ఆమెను ఢీకొట్టి వెళ్లింది. దీంతో మహిళ తల పూర్తిగా తెగిపోయి దూరంగా పడిపోయిన దృశ్యం భీతావహంగా మారింది. సంఘటన స్థలాన్ని చూసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మహిళ మరణించింది.
Also Read : ఉక్రెయిన్‌పై భీకర దాడులు.. 300కుపైగా డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా
టోల్ గేట్ వద్ద ఘోరం..
ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న యువకుడు కూడా బలంగా కిందపడిపోయి తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన తీరును చూసిన వారంతా తీవ్ర వేదనకు లోనయ్యారు. రక్తపు మడుగులో పడిపోయిన మహిళ మృతదేహాన్ని చూసి చూసిన వారందరూ దిగ్బ్రాంతికి గురయ్యారు. మృతిచెందిన మహిళను ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో ఒకరుగా గుర్తించారు. అనంతరం సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: దంపతుల్లో పెరుగుతున్న ఒబెసిటీ ప్రమాదం.. ICMR హెచ్చరికలు తెలుసుకోండి
బైక్,ఆటో వేగం అధికంగా ఉండడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న ఇతర ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే మహిళ మాత్రం తీవ్రంగా గాయపడటంతో ఆమెకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడి పరిస్థితి కూడా దారుణంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించేలోపే అతడు మృతి చెందాడు. ఈ సంఘటనతో ముమ్మిడివరం మండల ప్రజల్లో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఈ ఆహారాలకు ఆ రోగి దూరంగా ఉంటే లైఫ్‌సెఫ్.. లేదంటే వారి ఆరోగ్యంపై..
Also Read : ‘హరి హర వీరమల్లు’ టికెట్ ధరలు పెంపు
( AP Crime | ap crime latest updates | ap crime updates | ap-crime-news | Latest News | telugu-news )