Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై భీకర దాడులు.. 300కుపైగా డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా మళ్లీ ఉక్రెయిన్‌పైకి 300లకు పైగా డ్రోన్లు, 30 క్షిపణులతో విరుచుకుపడింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో చాలావరకు నివాస భవనాలు, ఆస్పత్రులు, వాహనాలు ధ్వంసమయ్యాయి.

New Update
Russia attacks Ukraine with more than 300 drones and missiles overnight

Russia attacks Ukraine with more than 300 drones and missiles overnight

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా మళ్లీ ఉక్రెయిన్‌పైకి 300లకు పైగా డ్రోన్లు, 30 క్షిపణులతో విరుచుకుపడింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో చాలావరకు నివాస భవనాలు, ఆస్పత్రులు, వాహనాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. భవనాల శిథిలాల కింద చాలామంది చిక్కుకుని ప్రాణాలతో పోరాడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం వాళ్లను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

Also Read: కేంద్రం గుడ్‌న్యూస్.. వాళ్లకు నెలకు రూ.50 వేల ఆర్థిక సాయం

Russia Attacks Ukraine

ఒడేసా నగరంపై ఏకంగా 20కి పైగా డ్రోన్లు, పదుల సంఖ్యలో క్షిపణులతో దాడులు చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. ఈ దాడుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారని.. మరికొందరు తీవ్రంగా గాయాలపాలయ్యారని తెలిపారు. దీనివల్ల భారీగా ఆస్తినష్టం సంభవించిందని, ఈశాన్య సుమీ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ సమయంలో తమకు అండగా ఉంటు ఆయుధాలు సరఫరా చేస్తున్న మిత్రదేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

Also Read :  జంతువులు అనారోగ్యంగా ఉన్నప్పుడు తమను తాము ఎలా చూసుకుంటాయో తెలుసా..?

Also Read :  వందకు పైగా సినిమాల్లో నటన..చివరి క్షణాల్లో పట్టించుకోని టాలీవుడ్‌

Also Read :  ఇన్‌స్టా రీల్స్ చేస్తే అరెస్ట్.. 3 నెలలు జైలు శిక్ష

Russia-Ukraine War | rtv-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు