Israel: గాజాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు..85 మంది మృతి
హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. తాజాగా చేసిన దాడుల్లో 85 మంది మరణించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం చేసిన వైమానిక దాడుల్లో 400 మంది చనిపోయారు.
హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. తాజాగా చేసిన దాడుల్లో 85 మంది మరణించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం చేసిన వైమానిక దాడుల్లో 400 మంది చనిపోయారు.
అక్రమ వలసదారుల కోసం అమెరికా ప్రభుత్వం కొత్త యాప్ తీసుకుని వచ్చింది. CBP హోమ్ యాప్ ను ఉపయోగించి స్వచ్ఛందంగా వారి దేశాలకు వాళ్ళు వెళ్ళవచ్చని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అలా వెళితే తరువాత మళ్ళీ ఎప్పుడైనా లీగల్ గా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు.
తెలంగాణలో ఈరోజు నుంచే టెన్త్ ఎగ్జామ్స్ మొదలవనున్నాయి. నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 5.09 లక్షల మంది ఈసారి ఎగ్జామ్స్ రాయనున్నారు.
భారతదేశానికి గట్టి షాక్ ఇచ్చారు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్. సోషల్ మీడియా ఎక్స్ భారత ప్రభుత్వంపై దావా వేసింది. చట్ట విరుద్ధంగా కంటెంట్ ను నియంత్రిస్తోందని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
హైదరాబాద్ లోని మెట్రో రైళ్ళపై ఉన్న బెట్టింగ్ యాప్స్ ప్రకటనలపై ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. వీటిని వెంటనే తొలగించాలని ఎల్అండ్టీ, సంబంధిత అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలను ఆదేశించామని తెలిపారు.
కర్ణాటకలో హనీ ట్రాప్ భయపెడుతోంది. మంత్రులు, రాజకీయ నేతలే లక్ష్యంగా హనీ ట్రాప్ చేస్తున్నారని తెలుస్తోంది. జాతీయ స్థాయి నేతలతో సహా 48 మంది రాజకీయ నాయకులు ఇందులో బాధితులుగా ఉన్నారంటూ ఓ మంత్రి వ్యాఖ్యలు చేయం దుమారం రేపుతోంది.
రెండు రోజుల క్రితం జరిగిన నాగ్ పూర్ అల్లర్లో దారుణాలు చోటు చేసుకున్నాయి. మతోన్మాద గుంపులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో వారిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ పై నిందితులు లైంగికదాడికి యత్నించారు.
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఉత్సాహంగా ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో మొదలవ్వ బోయే ఐపీఎల్ ముందు ఫ్యామిలీతో కలసి మాల్దీవుల్లో చిల్ అవుతున్నారు. ఖరీదైన రిసార్ట్ లో కూతురితో ఎంజాయ్ చేస్తున్నాడు.
మార్చి 21న ఏపీ సీఎం చంద్రబాబు మనుమడు దేవాన్స్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మొత్తం తిరుమలకు వెళ్ళనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత అక్కడి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాల్ని వడ్డించనున్నారు.