/rtv/media/media_files/2025/09/03/jinping-2025-09-03-22-46-11.jpg)
China President Jinping
ప్రస్తుతం ప్రపంచంలో వాణిజ్య యుద్ధం పీక్స్ లో ఉంది. అమెరికా దాదాపు అన్ని దేశాల మీదా టారిఫ్ లను విధించడంతో...ఆ దేశం తో సుంకాల యుద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద దేశాలైన చైనా, రష్యా, భారత్ లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనాలో జరుగుతున్న ఎస్సీవో సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మోదీ, ఉత్తర కొరియా, పాకిస్తాన్ అధినేతలు పాల్గొన్నారు. దాని తరువాత పుతిన్, కిమ్ జొంగ్ ఉన్ తదితరులు..రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా ఏర్పాటు చేసిన ఆయుధ ప్రదర్శనలో కూడా పాల్గొన్నారు.
చర్చలా..యుద్ధమా..తేల్చుకోండి..
ఈ ఆయుధ ప్రదర్శనలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం ముందు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయన్నారు. శాంతా, యుద్ధమా...చర్చలా ఘర్షణా...ఏం కావాలో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. యుద్ధానికి సై అంటే తాము సై అని సంకేతాలిచ్చారు. ఆయుధ ప్రదర్శనలో పాల్గొన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు పుతిన్, జెన్ పింగ్ లను కలిపి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు చైనా అధ్యక్షుడు రిప్లై ఇచ్చారు. వారు ముగ్గురూ కలిసి యూఎస్ కు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని అన్నారు. రెండో ప్రపంచయుద్ధంలో చైనా కోసం పోరాడిన అమెరికన్ సైనికుల త్యాగాలను గుర్తించాలన్నారు. దీనికే జెన్ పింగ్ సమాధానమిచ్చారని అంటున్నారు.
మరోవైపు ఆయుధ ప్రదర్శనలో చైనా తన అత్యాధునిక ఆయుధాలను ప్రదర్శించింది. భారీ అణు క్షిపణిని ప్రపంచానికి పరిచయం చేసింది. దాని పేరు డీఎఫ్ 5సీ అని చెప్పింది. ప్రపంచంలో ఎక్కడి లక్ష్యాన్ని అయినా ఛేదించగలదని చెప్పింది. దీంతో అమెరికాతో పాటూ చాలా దేశాలకు చైనా వార్నింగ్ ఇచ్చింది. తమతో పెట్టుకుంటే మటాషే అని చెప్పకనే చెప్పింది.
Also Read: BIG BREAKING: ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు..చౌకగా నిత్యావసర వస్తువులు