Yamuna river Floods: దేశ రాజధానిని ముంచెత్తిన యమున..వరద నీటిలో సచివాలయం

దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆగకుండా పడిన వర్షాల వల్ల అక్కడి యమునా నదిలో నీటి మట్టం పెరిగిపోయింది. దీంతో ఢిల్లీలోకి భారీగా వరద నీరు వచ్చి లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. 

New Update
delhi floods

Yamuna River Floods In Delhi

ఢిల్లీలోని యమునా నది డేంజర్ గా ఉంది. వర్షాలకు నదిలో నీటి మట్టం బాగా పెరిగిపోయింది. దీంతో నీరంతా సిటీలోకి వచ్చేసింది. యుమునలోని వరద నీరు ప్రమాదకర స్థాయిని దాటి 207.41 మీటర్ల దగ్గర ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అక్కడి లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. అత్యంత రద్దీగా ఉండే నిగంబోధ్ ఘాట్ లోకి నీరు వచ్చి చేరింది. ఢిల్లీ సెక్రటేరియట్‌లోకి నీరు చేరింది. మయూర్ విహార్‌లోని సహాయ శిబిరం కూడా నీట మునిగిపోయింది. ఐటీఓ క్రాసింగ్ , అలీపూర్ ఫ్లైఓవర్ వద్ద కూడా పరిస్థితి దారుణంగా ఉంది.    NH-44లోని అలీపూర్ సమీపంలోని ఫ్లైఓవర్‌లో ఒక భాగం కూలిపోయింది. ఇందులో ఒక కారు చిక్కుపోయింది. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ వరద నీరు కారణంగా ఢిల్లీలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 

ప్రమాదస్థాయిని మించి...

ఢిల్లీలోకి యమునా నది నీరు వచ్చేయడం ఇది మూడోసారి. ఇంతకు ముందు 1978, 2023లలో ఇలానే జరిగింది. 2023లో యమునా నది నీటి మట్టం 208.66 మీటర్లకు చేరింది. ఇక 1978లో నీటి మట్టం 207.49 మీటర్లకు చేరింది. ప్రస్తుతం కూడా ఇంతే స్థాయిలో యమున ప్రవహిస్తోందని అధికారులు చెబుతున్నారు. దీని కారణంగా యమునా బజార్, గీతా కాలనీ, మజ్ను కా తిలా, కాశ్మీరీ గేట్, గర్హి మండు, మయూర్ విహార్ వంటి ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి. దీంతో దాదాపు 14 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఐటీఓ, మయూర్ విహార్, గీతా కాలనీల్లో సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు.

Also Read: Trump On Tariffs: ముందుంది ముసళ్ళ పండుగ.. సుంకాలపై ట్రంప్ మళ్ళీ బెదిరింపులు

Advertisment
తాజా కథనాలు