US Economic Crisis:  ట్రంప్ తల తిక్క నిర్ణయాలు.. ఆర్థిక మాంద్యంలో అమెరికా

అమెరికా ఫస్ట్..దేశాన్ని మార్చేస్తా..మళ్ళీ సంపన్న దేశంగా చేసేస్తా అని బీరాలు పలికిన అధ్యక్షుడు ట్రంప్...తన తల తిక్క నిర్ణయాలతో కష్టాల్లోకి నెట్టేశారు. ట్రంప్ విధించిన టారిఫ్ ల కారణంగా అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటోంది.

New Update
recision

చాలా ఏళ్ళుగా అమెరికా పరిస్థితి ఏ బాలేదు. పైకి అగ్రరాజ్యం అని డాబులు చెప్పుకుంటున్నా..డబ్బులు లేక నానా అవస్థలూ పడుతోంది. ఇలాంటి టైమ్ లో తనను ఎన్నుకుంటే మాయ చేస్తా..మొత్తం అంతా మార్చేస్తా అన్నారు ట్రంప్. పాపం అమెరికన్లు కూడా ఆయనను నమ్మి అధ్యక్షుడిగా చేశారు. పదవిలోకి వచ్చిన దగ్గర నుంచీ టకటకా నిర్ణయాలు తీసేసుకున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అకన్ అనే నినాదంతో వైల్డ్ డెసిషన్స్ తీసుకున్నారు. ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ తో కలిసి  అమెరికా చాలా వాటిని మార్చేశారు. తరువాత ఇందులో నుంచి నెమ్మదిగా మస్క్ తప్పుకున్నారు. కానీ ట్రంప్ మాత్రం ఎడాపెడా పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు.  ఇందులో అతి పెద్దది టారిఫ్ లు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసే వస్తువులపై అదనపు సుంకాలను విధించారు. దీంతో అమెరికాకు బోలెడు డబ్బులు వస్తాయి అన్నారు. యూఎస్ మళ్ళీ ధనిక దేశం అయిపోతుందని చెప్పారు. కానీ తీరా చూస్తే సీన్ రివర్స్ అయిపోయింది. 

ఆర్థిక మాంద్యం అంచుల్లో యూఎస్..

బాస్ ట్రంప్ అనుకున్నది ఏమీ జరగలేదు సరి కదా..పైగా మరిన్ని కష్టాలను కొని తెచ్చింది. టారీఫ్ లతో విపరీతమైన మనీ వచ్చేస్తుంది. అమెరికా రిచ్ అయిపోతుంది అనుకున్నారు. కానీ సుకాల పెంపుతో అమెరికా పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. ఆర్థిక మాంద్యం అంచుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే ఈ విషయమై చాలా మంది హెచ్చరించారు. తాజాగా 2008లో యూఎస్ ఆర్థిక మాంద్యాన్ని అంచనా వేసిన మొదటి ఎకనామిస్ట్ మార్క్ జండీ అమెరికా స్థిగతులపై మాట్లాడారు. ట్రంప్ టారీఫ్ అమలు ఓ చెత్త నిర్ణయం అని తిట్టిపోశారు. వాటి కారణంగా యూఎస్ మరింత ఆర్ధిక మాంద్యంలో కూరుకుపోతోందని చెబుతున్నారు. వచ్చే ఏడాదికి ఇక్కడ ద్రవ్యోల్బణం 3 నుంచి 4 శాతానికి చేరుకుంటుందని హెచ్చరిస్తున్నారు ఎకనమిస్ట్ మార్ జండీ. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి చెబుతున్నారు. టారిఫ్ ల పెంపుతో అమెరికన్ కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయని జండీ అంటున్నారు. 

ఆల్రెడీ కనిపిస్తున్న ఎఫెక్ట్...

కెనడా, మెక్సికో, చైనా, భారత్ లాంటి దేశాల మీద అదనపు సుంకాలతో విరుచుకుపడ్డారు ట్రంప్. దీంతో అక్కడి నుంచి యూఎస్ కు దిగుమతి అయ్యే వస్తువుల సంఖ్య తగ్గిపోయింది.  ఒకవేళ వచ్చినా అధిక సుకాలు చెల్లించాల్సి రావడంతో రేట్లను విపరీతంగా పెంచేశారు. దీంతో ఈ భారం అంతా అమెరికాలో వినియోగదారులపై పడింది. చవక వస్తువులకు మారు పేరైన వాల్ మార్ట్, టార్గెట్ లాంటి వాటిల్లో కూడా ధరల పెరుగుదల కనిపించింది. చాలా కంపెనీలు ఉత్పత్తులను పంపొద్దని చెబుతున్నాయి.  దీని కారణంగా నిత్యావసర వస్తువుల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. ఉత్పత్తి తక్కువ అయిపోవడంతో ఉన్న వాటిని ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇదిలానే కొనసాగితే అమెరికాలో దారుణంగా ఆర్థిక మాంద్యం వస్తుంది.  

Also Read: Breaking: కొత్త జీఎస్టీతో భారీగాపెరగనున్న ఐపీఎల్ టికెట్ రేట్లు

Advertisment
తాజా కథనాలు