Breaking: కొత్త జీఎస్టీతో భారీగాపెరగనున్న ఐపీఎల్ టికెట్ రేట్లు

జీఎస్టీ శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులను చేసింది. నాలుగు శ్లాబులను రెండుగా కుదించింది. విలాసవంతమైన వాటికి 40 శాతం పన్ను విభాగంలో ఉంచింది.  దీని కారణంగా  ఐపీఎల్ టికెట్ల రేట్లు పెరగనున్నాయి.  

New Update
ipl

రేస్‌ క్లబ్బులు, లీజింగ్‌/ రెంటల్‌ సేవలు, క్యాసినోలు, జూదం, గుర్రపు పందేలు, లాటరీ, ఆన్‌లైన్‌ మనీ గేమింగ్‌పై 40 శాతం జీఎస్టీ సూలు చేయనున్నారు. ఈ జాబితాలో ఐపీఎల్ క్రికెట్ లీగ్, మరికొన్ని స్పోర్ట్ ఈ వెంట్లు ఇందులో చేరనున్నాయి. దీంతో ఐపీఎల్ టికెట్లు రేట్లు భారీగా పెరగనున్నాయి. ఇప్పటి వరకు ఈ టికెట్ల రేట్లపై 28 శాతమే జీఎస్టీ వసూలు చేసేశారు. కానీ ఇక మీదట వీటిపై 40 శాతం పన్ను వసూలు చేయనున్నారు. దీంతో క్రికెట్ అభిమానులపై భారం పడనుంది. 

ఒక్కో టికెట్ మీద పెరిగే మనీ..

ఈనెల 22 నుంచి అమల్లోకి రానున్న కొత్త  జీఎస్టీ రూల్స్ ప్రకారం.. ప్రతీ టికెట్ పై  40 శాతం పన్ను చెల్లించాలి. అంటే టికెట్ వెయ్యి రూపాయలు ఉంటే దానికి అదనంగా మరో  రూ.400 కలిపి మొత్తం రూ. 1400 చెల్లించాలి. అంటే గతంతో పోలిస్తే దీని ధర రూ.120 వరకూ పెరగనుంది. ఐపీఎల్ టికెట్ల ధరలూ ప్రతీ ఏడాది మారుతూ ఉంటాయి. దానిని బట్టి టికెట్ల ధరలు మారుతూ ఉంటే.. ఆ భారంలోనూ హెచ్చుతగ్గులు ఉంటాయి. అయితే ఈ టికెట్లపై అదనసు జీఎస్టీ కేవలం ఐపీఎల్‌ లేదా ఇతర ప్రీమియం లీగులకు మాత్రమే వర్తిస్తాయి. క్షేత్రస్థాయి క్రీడలకు మాత్రం ఇది ఉండదు. 

Also Read: Full Josh: జీఎస్టీ శ్లాబ్ ల మార్పు.. పండుగ చేసుకుంటున్న స్టాక్ మార్కెట్

Advertisment
తాజా కథనాలు