/rtv/media/media_files/2025/09/04/sm-2025-09-04-09-57-51.jpg)
Stock Market Update Today
కేంద్ర ప్రభుత్వం(Central Government) కొత్త ఆర్థిక సంస్కరణలను చేపట్టింది. ఇందులో భాగంగా జీఎస్టీల్లో రెండు శ్లాబ్(gst slab rates 2025) లను మాత్రమే కంటిన్యూ చేస్తామని ప్రకటించింది. అన్ని వస్తువులపై 5, 18 శాతాల జీఎస్టీను మాత్రమే అమలు చేయనున్నారు. ఈ నెల 22 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. రైతులు, సామాన్యులను దృష్టిలో ఉంచుకుని కొత్త మార్పులను చేశామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యవసాయం, వైద్య రంగాల్లో ఉన్నవారికి పెద్ద రిలీఫ్ కానున్నాయి కొత్త జీఎస్టీ శ్లాబ్ రేట్స్. అలాగే దీని ఫైలింగ్ కూడా సరళం చేయనున్నారు.
Also Read : ఇకపై ఏసీ, టీవీలు, ఎలక్ట్రానిక్స్ చౌక చౌక.. ఈ రేట్లు అస్సలు ఊహించలేరు..!
పరుగులు పెడుతున్న సెన్సెక్స్, నిఫ్టీ..
జీఎస్టీ లో మార్పులతో నిత్యావసర వస్తువుల దగ్గర నుంచీ టీవీలు, కార్ల వరకూ అన్నింటి ధరలూ భారీగా తగ్గనున్నాయి. ఈ నిర్ణయం ప్రభావం రోజు స్టాక్ మార్కెట్ మీదనా చూపించింది. ఉదయం మొదలైన దగ్గర నుంచే మార్కెట్ లాభాల్లో పరుగులు పెడుతూ ఆకుపచ్చను సంతరించుకుంది. సెన్సెక్స్ 600 పాయింట్లు లేదా 0.70% పెరిగి 81,100 పైన ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 150 పాయింట్లు లేదా 0.60% పెరిగి 24,860 పైన ట్రేడవుతోంది. ఈరోజు మార్కెట్లో ఆటో, FMCG స్టాక్‌లలో అతిపెద్ద లాభం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 2% కంటే ఎక్కువ పెరిగింది. FMCG ఇండెక్స్ దాదాపు 1.5% పెరిగింది. రియాలిటీ ఇండెక్స్ కూడా దాదాపు 1% పెరిగింది. మరోవైపు MET ఇండెక్స్ మాత్రం 0.30% తగ్గింది.
నిన్న కూడా..
నిన్న కూడా స్టాక్ మార్కెట్(Stock Market Today) లాభాలతోనే ముగించింది. సెన్సెక్స్(sensex-today) 410 పాయింట్లు పెరిగి 80,568 దగ్గర ముగియగా..నిఫ్టీ(Nifty) కూడా 135 పాయింట్లు పెరిగి 24,715 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ లో 22 స్టాక్స్ చివర వరకూ లాభాల్లో ఉన్నాయి. మరోవైపు సెప్టెంబర్ 3న విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) నగదు విభాగంలో రూ.1,721.82 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అదే సమయంలో, దేశీయ పెట్టుబడిదారులు (DIIలు) రూ.2,679.86 కోట్ల నికర కొనుగోళ్లు చేశారు.
అంతర్జాతీయ మార్కెట్ మిశ్రమంగా..
భారత్ మార్కెట్ ఊపు మీదున్నప్పటికీ ప్రపంచ మార్కెట్లు మాత్రం మిశ్రమంగా సాగుతున్నాయి. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 1.23% పెరిగి 42,456 దగ్గర, కొరియా కోస్పి 0.40% పెరిగి 3,197 వద్ద ఉన్నాయి. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 1.20% తగ్గి 25,038 దగ్గర ఉండా.. చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 1.97% తగ్గి 3,738 వద్ద ముగిసింది. మరోవైపు సెప్టెంబర్ 3న అమెరికా డౌ జోన్స్ 0.054% తగ్గి 45,271 దగ్గర ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ 1.02%, ఎస్&పి 500 0.51% పెరిగాయి.