రష్యా నుంచి మురు దిగుమతి చేసుకుంటూ ఉక్రెయిన్ తో యుద్ధానికి భారత్ ప్రోత్సహిస్తోంది అంటూ ట్రంప్ 50 శాతం సుంకాలను విధించారు. లాస్ట్ మంత్ 27 నుంచి అవి అమల్లోకి వచ్చాయి. ఈ దెబ్బకు భారత్ కాళ్ళ బేరానికి వస్తుందని ఆశించారు అమెరికా అధ్యక్షుడు. తాను చెప్పినట్టు వినడమే కాకుండా.. అమెరికా వస్తువులను భారత్ లో దిగుమతికి కూడా ఒప్పుకుంటుందని అనుకున్నారు.అయితే ఆయన ప్లాన్ లన్నింటినీ తల్లకిందులు చేస్తూ భారత ప్రభుత్వం అమెరికా సుంకాలను ఏమీ పట్టించుకోలేదు. తమపై భారం పడినా కూడా దేశ రైతులు, పాడి వ్యవసాయదారుల క్షేమమే ముఖ్యమని ప్రధాని మోదీ కూడా తెగేసి చెప్పేశారు. దానికి తోడు చైనా, జపాన్, రష్యాలతో కొత్త ఒప్పందాలను చేసుకుంటూ..అమెరికా లేకపోయినా పర్వాలేదన్నట్టు ఉన్నారు. తమ వాణిజ్యాన్ని ఇతర దేశాలకు విస్తరించుకుంటూ ముందు దూసుకుపోతోంది.
రెండు, మూడు విడతలున్నాయ్..
భారత్ వ్యవహారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మింగుడు పడడం లేదు. అందుకే సుంకాల గురించి రోజూ ఏదో ఒక అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. ఇండియాను భయపెట్టాలని చూస్తున్నారు. తాజాగా ఆ దేశంపై ఇంకా పూర్తి స్థాయిలో ఆంక్సల మోత మోగించలేదని చెప్పుకొచ్చరు ట్రంప్. కేవలం సెకండరీ టారిఫ్ లను మాత్రమే విధించానని...ఇంకా రెండు, మూడు విడతలున్నాయని చెప్పారు. దానికితోడు చైనా, భారత్, బ్రెజిల్ లు అమెరికాను చంపేస్తున్నాయి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ దేశం పూర్తిగా సుంకాలు ఎత్తేస్తానని ముందుకు వచ్చింది కానీ.. అంతకు ముందు ఏకపక్షంగా ఉండేదని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాకనే భారత్ తో వాణిజ్య ఒప్పందాల విషయంలో మార్పును తీసుకువచ్చానని చెప్పారు. యూఎస్ దిగుమతులపై భారత్ విధిస్తున్న భారీ సుంకాలను ఇక మీదట ఒప్పుకునేది లేదని అన్నారు. దానికి తగ్గట్టుగానే అమెరికా కూడా టారిఫ్ లను విధించిందని చెప్పుకొచ్చారు. తాము భారత్‌తో పెద్దగా వ్యాపారం చేయడం లేదు కానీ, వారు మాతో చేస్తున్నారని అన్నారు.
వాళ్ళే మాతో వ్యాపారం..
ఇండియా ఉత్పత్తులు యూఎస్ లో భారీగా దిగుమతి అవుతున్నాయి. దీని వలన అమెరికా తయారీదారులకు తీవ్ర నష్టం కలుగుతోంది. మరోవైపు అమెరికా ఉత్పత్తులు మాత్రం భారత్ కు ఎగుమతి అవడం లేదు. చేస్తున్న వాటి మీద కూడా 100శాతం సుంకాలను విధిస్తున్నారు. అవి ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. అందుకే తాను కూడా సుంకాలను విధించానని...తాను చేసిన పనిని సమర్ధించుకున్నారు ట్రంప్. మేము భారత్‌తో చిన్నపాటి వ్యాపారం చేస్తామని కొందరు అనుకుంటారు. కానీ భారత్ మాతో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తోంది. ఇంకో మాటలో చెప్పాలంటే.. మాకు వాళ్లు పెద్ద సంఖ్యలో వస్తువులు అమ్ముతుంటారు. వారికి అతిపెద్ద క్లైయెంట్ మేమే. కానీ మేము మాత్రం వాళ్లకి చాలా తక్కువగా అమ్ముతున్నాం. గత దశాబ్దాలుగా ఇదే కొనసాగుతోంది. భారత్ ఏ దేశంపై కూడా విధించని అధిక టారిఫ్‌లు మాపై విధించింది. అందువల్ల మా వ్యాపారాలను భారతీయులకు అమ్మలేకపోతున్నామని ట్రంప్ చెప్పారు.
Also Read: Kim Jong: అతి జాగ్రత్తలో కిమ్ జోంగ్..పుతిన్ తో సమావేశం తర్వాత ఆయన డీఎన్ఏను క్లీన్ చేసిన అనుచరులు
Trump On Tariffs: ముందుంది ముసళ్ళ పండుగ.. సుంకాలపై ట్రంప్ మళ్ళీ బెదిరింపులు
భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పగ ఇప్పటిలో చల్లారేలా కనిపించడం లేదు. పూర్తిగా తనకు లొంగితేనే కానీ ఒప్పుకోను అంటున్నారు ట్రంప్. భారత్ పై టారిఫ్ ల విధింపు ఇంకా ఉందని అంటున్నారు. రెండు, మూడు విడతలు ఉన్నాయని స్పష్టం చేశారు.