PM Modi ON GST: పిల్లలు తినే చాకెట్ల పైనా పన్ను..జీఎస్టీ మార్పుల తర్వాత కాంగ్రెస్ పై మోదీ విమర్శ..

దేశంలో ఆర్థిక సంస్కరణలపై ప్రధాని మోదీ స్పందించారు. దేశ ప్రగతికి తదుపరి తరం సంస్కరణలు అవసరమని భావించామని..అందుకే మార్పులు చేపట్టామని తెలిపారు. పనిలో పనిగా చాకెట్ల మీద కూడా కాంగ్రెస్ పన్నులు విధించిందంటూ మోదీ విరుచుకుపడ్డారు.

New Update
Modi On GST

2047 వికసిత భారత్ దిశగా ప్రధాని మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తదుపరి తరానికి సంబంధించి ఆర్థిక సంస్కరణలను చేపట్టింది. మొట్టమొదటగా జీఎస్టీ లో మార్పులను చేసింది. ఇంతకు ముందు నాలుగు రకాలుగా ఉండే జీఎస్టీ పన్నులను రెండు కింద కుదించింది. ఇప్పుడు 5 శాతం, 18 శాతం మాత్రమే ప్రతీ వస్తువు మీద జీఎస్టీను అమలు చేయనున్నారు.  దీపావళికి ముందే ప్రజలకు రెట్టింపు ఆనందం అందిస్తామని హామీ ఇచ్చాని...అందుకు తగ్గట్టుగానే సవరణలు చేశామని ప్రధాని మోదీ తెలిపారు.

కొత్త ఆర్థిక సంస్కరణల్లో పంచరత్నాలు..

దేశాన్ని స్వావలంబన దిశగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ప్రజలకు అనుకూలంగా వెళ్ళడమే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో భారీగా పన్నులు వేశారు. చిన్న పిల్లలు తినే చాకెట్ల మీద కూడా 21 శాతం వసూలు చేశారు. కానీ తాము అలా చేయలేదు అంటూ మోదీ చెప్పుకొచ్చారు. కొత్త ఆర్థిక సంస్కరణల్లో పంచరత్నాలను అందిస్తున్నామని మోదీ తెలిపారు. ఇందులో జీఎస్టీ రేట్ల తగ్గింపుతో పేదలు, మధ్యతరగతి, మహిళలు, విద్యార్థులు, రైతులు, యువత.. అందరికీ లాభం, ప్రయోజనం ఉంటాయని చెప్పారు. ఆత్మ నిర్భర్ కల దీనితో సాకారం అవుతుందని ప్రధాని మోదీ అన్నారు. అదే కాదు ప్రతీ భారతీయుడికి అవసరమైన ఆరోగ్య సంరక్షణ ఎల్లప్పుడూ అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. 

దేశాభివృద్ధికి ముందడుగు..

ఈసారి దీపావళి, ధనతేరస్ పండుగలు మరింత ఉత్పాహంగా ఉంటాయని ప్రధాని మోదీ అన్నారు. ఆ పండుగలకు ముందే జీఎస్టీ రేట్లలో మార్పులు వస్తాయి. దీని కారణంగా నిత్యావసర వస్తువులతో పాటూ అన్ని ఉత్పత్తుల ధరలూ భారీగా తగ్గుతాయి. దీంతో దశాబ్దాల కల సాకారమైందని మోదీ అన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఇదొక అతి పెద్ద ఆర్థిక సంస్కరణ అని చెప్పారు. దేశాభివృద్ధికి, మద్దతుకు జీఎస్టీ సంస్కరణలు రెట్టింపు ముందడుగు అని ప్రధానమంత్రి అభివర్ణించారు.

Advertisment
తాజా కథనాలు