Kim Jong: అతి జాగ్రత్తలో కిమ్ జోంగ్..పుతిన్ తో సమావేశం తర్వాత ఆయన డీఎన్ఏను క్లీన్ చేసిన అనుచరులు

పుతిన్ తో కిమ్ జోంగ్ సమావేశం తర్వాత జరిగిన పరిణామాల గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. సమావేశం తర్వాత కిమ్ భద్రతా సిబ్బంది ఆయన కూర్చున్న, తాకిన ప్రదేశాలన్నింటిలో ఆయన డీఎన్ఏ ఎక్కడా దొరక్కుండా శుభ్రంగా చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

New Update
kim

KIM JONG

ఉత్తర కొరియా కిమ్ జోంగ్..ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వింత వార్తలు రావాల్సిందే. కరడు గట్టిన నియంతగా పేరు తెచ్చుకున్న కిమ్ గురించి చాలా కథలే చెబుతారు. ఆయన మనుషులుని ఎంత హీనంగా చూస్తారు. సర్వెంట్లను ఎలా ట్రీట్ చేస్తారు లాంటి వాటి గురించి చాలానే కథలు బయటకు వచ్చాయి. తాజాగా చైనాలో ఎస్సీవో శిఖరాగ్ర సదస్సుకు కిమ్జోంగ్ కూడా హాజరయ్యారు. దాని తరువాత చైనా ఆయుధ ప్రదర్శనలో కూడా పాల్గొన్నారు. అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఉత్తర కొరియా అధ్యక్షుడు సమావేశమయ్యారు.  అయితే ఇదంతా చాలా నార్మల్ గానే జరిగిపోయింది. కానీ ఈ సమావేశం తర్వాత జరిగిన సంఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 

కిమ్ జోంగ్ ఉన్న ప్రదేశం క్లీన్..

రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశం జరిగిన తర్వాత అక్కడ ఉత్తర కొరియా అధినేత కిమ్ ఉపయోగించిన ప్రతీ వస్తువు, ఆయన కూర్చొన్న కుర్చీ ఇలా మొత్తం అన్నీ ఆయన సిబ్బంది శానిటైజ్ చేశారు. మీటింగ్ జరిగిన వెంటనే ఇమ్మీడియట్ గా వచ్చి మరీ అన్నీ క్లీన్ చేసేశారు. అంతే కాదు కిమ్  తాగిన డ్రింక్ గ్లాస్ ను అయితే చాలా జాగ్రత్తగా వేరేగా తీసుకుని మీ వెళ్ళారు. మీటింగ్ జరిగిన గదిలో ఏ వస్తువునూ కిమ్ అనుచరులు వదల్లేదు. ప్రతీ దాన్ని పట్టి పట్టి మరీ రుద్ది క్లీన్ చేశారు. కిమ్ ఆనవాళ్ళు, డీఎన్ ఏ ఎక్కడా ఉండిపోకుండా ఉండడానికే ఇలా చేశారని చెబుతున్నారు.

పుతిన్ కూ ఇదే టైప్ భద్రత..

డీఎన్ఏ భద్రతకు సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతినే అనుకుంటే ఆయనకు బాబులా ఉన్నారు కిమ్ జోంగ్. పుతిన్ డీఎన్ఏ ఎక్కడా, ఎవరికీ దొరకకుండా ఆయన అంగరక్షకులు జాగ్రత్తలు తీసుకుంటారు. పుతిన్ వేరే దేశాలకు వెళ్ళినప్పుడల్లా ఆయన మలం, యూరిన్ ను సీలు చేసిన సంచీలలో సేకరిస్తారు. దాన్ని తరువాత మాస్కో తీసుకుని వెళతారు. 2017 నుంచి పుతిన్ ఈ పద్ధతిని అమలు పరుస్తున్నారు.  రష్యా అధ్యక్షుడి ఆరోగ్యం గురించి సమాచారం శత్రువులకు అందకుండా ఉండడం కోసం దీన్ని చాలాస్ట్రిక్ట్ గా పాటిస్తారు. ట్రంప్ తో సమావేశం కోసం పుతిన్ అలస్కా వచ్చినప్పుడు కూడా ఇలాగే చేశారని చెబుతున్నారు.   అయితే ఇప్పుడు ఈయన కన్నా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నారు. చేతి, వేలి ముద్రలు కూడా ఎవరికీ దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారు.

Also Read: New GST Slabs: మారిన జీఎస్టీ శ్లాబ్ రేట్స్..కార్ల నుంచి బిస్కెట్ల వరకూ రేట్లు తగ్గిన వస్తువుల లిస్ట్ ఇదే..

Advertisment
తాజా కథనాలు