Asia Cup 2025: ఇండియా, బంగ్లా మ్యాచ్ ఈరోజు...గెలిస్తే ఫైనల్స్ కే..

ఆసియా టోర్నీలో టీమ్ ఇండియాకు ఇప్పటి వరకు తిరుగులేదు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇప్పుడు మరో సమరానికి సిద్ధమైంది. సూపర్ -4 లో ఈరోజు బంగ్లా తో మ్యాచ్ ఆడనుంది. ఇది గెలిస్తే డైరెక్ట్ గా ఫైనల్స్ కు వెళిపోతుంది. 

New Update
india vs bangla

India vs Bangladesh

క్రికెట్ లో టీమ్ ఇండియా...అన్ బీటబుల్ గా ఉంది.  ముఖ్యంగా టీ 20ల్లో భారత జట్టు అప్రతిహతంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో కూడా టీమ్ ఇండియాకు ఎదురు లేదు.  ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్ లలో గెలిచింది.  పాకిస్తాన్ తో ఆడిన రెండు మ్యాచ్ లు కూడా ఏమీ హోరాహోరీగా జరగలేదు.  కేవలం మాటల యుద్ధాలు మాత్రమే జరిగాయి.  ఇప్పుడు ఈరోజు భారత్ సూపర్ -4 లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఆడనుంది.  ఇరు జట్ల బలాబలాలు చూస్తే... బంగ్లా కన్నీ టీమ్ ఇండియానే అన్ని రకాలుగా పటిష్టంగా ఉంది. అలా అని ఆ టీమ్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆసియా కప్ టోర్నీలో భారత్ తరువాత బలమైన జట్టు బంగ్లదేశ్. తాజాగా శ్రీలంక జట్టును కూడా ఈ టీమ్ మట్టికరిపించింది. 

సూపర్ ఫామ్ లో..

ఇక భారత్ విషయానికి వస్తే...వరుస విషయాలతో టీమ్ జోరుమీదుంది. మనకు అన్ని రకాలుగా సామర్థ్యం ఉంది. అది ఉపయోగిస్తే చాలు ఎవరితో అయినా గెలిచేయగలదు. అందులోనూ బ్యాటింగ్ లైనప్ అద్బుతంగా ఉంది. ఓపెనర్ అభిషేక్ శర్మ దంచి కొడుతున్నాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతున్న అతడు ఇప్పటికే 200పై స్ట్రైక్ రేట్ తో 173 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్ గా ఉన్నాడు.  ఇతని తరువాత గిల్, కెప్టెన్ స్కై, తిలక్ వర్మ, దూబె, సంజూ శాంసన్ అందరూ బాగా ఆడుతున్నారు. గిల్ కూడా లాస్ట్ మ్యాచ్ పాక్ పై దుళ్ళగొట్టాడు. ఆసియా కప్ లో ఇతని స్ట్రైక్ రేట్ 158   గా ఉంది.  బౌలంగ్ కూడా పటిష్టంగానే ఉంది. శివమ్ దూబే చక్కగా రాణిస్తున్నాడు. స్పిన్నర్లు వరుణ్, కుల్ దీప్, అక్షర్ లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. అయితే భారత జట్టు ఫీల్డింగ్ నే కాస్త మెరుగుపర్చుకోవాల్సి ఉంది. పాక్ తో మ్యాచ్ లో మూడు క్యాచ్ లను వదిలేశారు. అలా ఈ సారి మాత్రం జరగకుండా చూసుకోవాలి. 

బ్యాటింగ్ వీక్..

బంగ్లాదేశ్ బౌలర్లలో..ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ చాటా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఇతని నుంచి భారత బ్యాటర్లకు కాస్త ఇబ్బంది ఎదురవచ్చు. శ్రీలంకపై అతడు 20 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ ఇతని బౌలింగ్ లో జాగ్రత్తగా ఆడాలి.  అయితే బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్ మాత్రం చాలా వీక్ గా ఉంది. భారత బౌలర్లను వీరు ఎదుర్కోవడం కష్టమే అని అంచనాలున్నాయి. బ్యాటర్లు లిటన్ దాస్, హృదోయ్ లు బాగా ఆడకపోతే జట్టు మొత్తం కుప్పకూలిపోతుంది. అయితే స్లో పిచ్ పై ముస్తాఫిజుర్, స్పిన్నర్లు రిషాద్, మెహదీ హసన్ రాణిస్తే టీమ్ ఇండియాను కట్టడి చేయొచ్చని బంగ్లా ఆశిస్తోంది. 

Also Read: న్యూ యార్క్ లో మొబైల్ హ్యాకింగ్..ఐరాస సమీపంలో రహస్య టెలికాం నెట్ వర్క్

Advertisment
తాజా కథనాలు