/rtv/media/media_files/zhTJ1U1UZhj7CFiY8zXk.jpg)
హెచ్ 1బీ వీసాల మీద అనిశ్చితి ఇంకా పూర్తిగా తొలిగిపోలేదు. మొదట వీసా ఫీజులను పెంచిన అమెరికా ప్రభుత్వం...తరువాత లాటరీ పద్ధతిని కూడా తీసేస్తున్నామని ప్రకటించింది. నైపుణ్యం కలిగిన విదేశీయులను మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. దీని ప్రభావం భారత్ పై పెద్ద ఎత్తునే పడింది. దీని కారణంగా భారత స్టాక్ మార్కెట్ కూడా కుదేలవుతోంది. గత రెండు రోజులుగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఈదుతున్నాయి. ఈరోజు కూడా ప్రారంభ సమయం నుంచే మార్కెట్ నేల చూపులు చూస్తోంది. సెన్సెక్స్ 300 పాయింట్లు తగ్గి 81,800 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా దాదాపు 80 పాయింట్లు తగ్గి 25,100 వద్ద ముగిసింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 7 పైసలు తగ్గి, 88.80 వద్ద జీవనకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. మరోవైపు అమెరికా మార్కెట్ కూడా పడిపోయింది.
సెన్సెక్స్ లోని 30 స్టాక్ లలో ఇరవై ఐదు స్టాక్ లు నష్టపోయాయి. టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఎయిర్ టెల్ నష్టపోయిన వాటిలో ఉన్నాయి. ఎన్ఎస్ఇ రంగాల సూచీలలో ఆటో, ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. అలాగే ఎస్బిఐ, ట్రెంట్, ఆసియన్ పెయింట్స్, మారుతి మరియు ఒఎన్ జిసి అత్యధికంగా లాభపడిన వాటిలో ఉన్నాయి. SBI షేర్లు 1 శాతం పెరుగుదలను చూస్తున్నాయి. స్మాల్, మిడ్-క్యాప్ స్టాక్ లు బెంచ్ మార్క్ సూచీల కంటే వెనుకబడి ఉన్నాయి. నిన్న కూడా మార్కెట్ ఫ్లాట్ ముగియడంతో ఋరోజు పెట్టుబడి దారులు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
మిశ్రమంగా ప్రపంచ మార్కెట్..
అంతర్జాతీయ మార్కెట్లు సైతం మిశ్రమంగా కదలాడుతున్నాయి. ఆసియా మార్కెట్లలో, జపాన్ నిక్కీ 0.43% తగ్గి 45,300 వద్ద, కొరియా కోస్పి 1.24% తగ్గి 3,443 వద్ద ట్రేడవుతున్నాయి. హాంకాంగ్ కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.86% పెరిగి 26,383 వద్ద, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.63% పెరిగి 3,845 వద్ద ట్రేడవుతున్నాయి. మరోవైపు సెప్టెంబర్ 23న US డౌ జోన్స్ 0.19% తగ్గి 46,293 వద్ద ముగిసింది. నాస్ డాక్ కాంపోజిట్ 0.95% , S&P 500 0.55% పడిపోయాయి.