Germany: అమెరికా పొమ్మంది..జర్మనీ రమ్మంటోంది

అమెరికా హెచ్1 బీ వీసా ఫీజులను పెంచాక...చాలా దేశాలు భారత్ కు ఆఫర్లు ఇస్తున్నాయి. చైనా, బ్రిటన్ లు ఇప్పటికే కొత్త విధానాలను ప్రకటించాయి. తాజాగా జర్మనీ కూడా మా దేశం వచ్చి ఉద్యోగం చేసుకోండి ఆహ్వానం పలికింది .

New Update
germany

Ambassador of Germany to India Dr. Philipp Ackermann

హెచ్ 1బీ వీసాలను,లాటరీ పద్ధతిని క్యాన్సిల్ చేసింది అమెరికా. నైపుణ్యం కలిగిన వ్యక్తులను మాత్రమే తీసుకుంటామని చెబుతోంది.  కొత్తగా హెచ్ 1బీ వీసా కావాలంటే లక్షల డాలర్ల ఫీజు కట్టాల్సిందే అంటూ రూల్స్ పెట్టింది.  దీని వలన చాలా మంది అమెరికా కల...కలగానే మిగిలిపోనుంది. అలాగే యూఎస్ లో చదువుకున్న విద్యార్థులు కూడా కష్టాలు పడనున్నారు.  తమ దేశస్థులకు మాత్రమే ఉద్యోగాలు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రూల్ పెట్టామని ట్రంప్ కార్యవర్గం చెబుతోంది. లక్ష డాలర్ల ఫీజు వలన యూఎస్ కు ఆదాయం కూడా వస్తుందని చెబుతోంది. కానీ నిజానికి దీని వలన అమెరికా నష్టమే జరుగుతుంది అంటఉన్నాయి టెక్ కంపెనీలు. విదేశాల నుంచి వచ్చే ఉద్యోగుల వలన అమెరికా ఆర్థికంగా చాలా సంపాదిస్తోందని..ఇప్పుడు ఈ కొత్త నిర్ణయం వలన అదంతా పోతుందని చెబుతున్నారు. 

ఆహ్వానం పలుకుతున్న ప్రపంచదేశాలు..

మరోవైపు అమెరికా పొమ్మంటే ఏమయింది మా దేశానికి రండి అంటున్నాయి మిగతా దేశాలు. ఇప్పటికే అమెరికా హెచ్1బీ వీసాకు ధీటుగా చైనా కె వీసాను తీసుకువచ్చింది. స్థానిక కంపెనీ స్పాన్సర్ షిప్ లేకుండానే ఈ వీసా పొందే అవకాశం ఉంది.  అమెరికాలో H-1B వీసా పొందడానికి ప్రయత్నిస్తున్న చాలామంది భారతీయ నిపుణులు, విద్యార్థులకు ఈ K వీసా(K Visa) ఒక కొత్త అవకాశంగా మారవచ్చు అని నిపుణులు భావిస్తు్న్నారు.  దీన్ని US H-1B వీసాకు పోటీగా అభివర్ణిస్తున్నారు నిపుణులు. వీసా ఫీజును US లక్ష డాలర్లకు పెంచడం చైనాకు కలిసొచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.  దీంతో పాటూ బ్రిటన్ కూడా వీసాల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, డిజిటల్ నిపుణుల కోసం వీసా ఫీజులను రద్దు చేసే ప్రతిపాదనలపై చర్చిస్తోంది.

జర్మనీ కూడా...

తాజాగా జర్మనీ కూడా మా దేశానికి రండంటూ పిలుస్తోంది.  భారత దేశంలో జర్మన్ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకెర్మాన్ ఈ విషయాన్ని ప్రకటించారు. జర్మనీ వలసవిధానాలు బావుంటాయని...అమెరికాలా...రాత్రికి రాత్రే రూల్స్ మార్చేయమని చెప్పారు. జర్మనీ తన స్థిరమైన వలస విధానాలు మరియు భారతీయులకు గొప్ప ఉద్యోగ అవకాశాలతో ప్రత్యేకంగా నిలుస్తుందని తెలిపారు.  ఇప్పటికే జర్మనీలో అత్యధికంగా సంపాదిస్తున్న భారతీయులు ఉన్నారు. ఇప్పుడు మరింత మంది తమ దేశం ఆహ్వానిస్తుందని చెప్పారు.  మా దేశంలో జర్మనుల కంటే భారతీయులే ఎక్కువ డబ్బులు పొందుతున్నారని తెలిపారు. మేము కష్టపడి పని చేసే వ్యక్తులను గౌరవిస్తామని డాక్టర్ అకెర్మాన్ అన్నారు. 

Also Read: Asia Cup 2025: ఇండియా, బంగ్లా మ్యాచ్ ఈరోజు...గెలిస్తే ఫైనల్స్ కే..

Advertisment
తాజా కథనాలు