/rtv/media/media_files/2025/09/24/trump-un-2025-09-24-06-50-50.jpg)
ఈరోజు న్యూ యార్క్ లో ఐరాస 80వ సెషన్ జరిగింది. దీనిలో 150 దేశాల అధినేతలు అందరూ పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 56 నిమిషాల పాటూ మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన ఐక్యరాజ్య సమితిపై మండిపడ్డారు. ఈ సంస్థవి ఉత్త మాటలేనని..చేతల్లేవని విమర్శించారు. ఆను పలు యుద్ధాలు ఆపడానికి ప్రయత్నిస్తుంటే..కనీస్ ఐరాస స్పందించడం లేదని..తనను సంప్రదించలేదని మండిపడ్డారు. దీంతోపాటూ భారత్, పాక్ యుద్ధం గురించి మళ్ళీ పాత పాటూ పాడారు. వారిద్దరి మధ్యా తానే ఆపానని...అలాగే ఏడు యుద్ధాలను ఆపానని మళ్ళీ ప్రకటించుకున్నారు. రెండో సారి అధ్యక్షుడు అయ్యాక ట్రంప్ ఐరాసలో మాట్లాడ్డం ఇదే మొదటిసారి. దాంతోపాటూ ఎక్కువ సేపు మాట్లాడింది కూడా ఈయనే కావడం గమనార్హం. ఇంతవరకూ ఏ అమెరికా అధ్యక్షుడూ ఐరాసలో ఇంతసేపు ప్రసంగించలేదు.
సామర్ధ్యం ఉన్నా ఏం చేయడం లేదు..
ఐరాసకు గొప్ప సామర్ధ్యం ఉందని తాను ఎప్పుడూ చెబుతానని..కానీ ఆ సంస్థ మాత్రం ఆ మాటలను ఎప్పుడూ నిజం చేయడదని విమర్శించారు. బలమైన మాటలతో లేక రాయడానికి...పాటించడానికి గానీ ముందుకు రాదని ధ్వజమెత్తారు. ఉత్త పదాలను రాస్తోందని...వాటితో ఏ సమస్యలూ పరిష్కారం కావని ట్రంప్ అన్నారు. కేవలం ఏడు నెలల్లోనే తాను ఏడఉ యుద్ధాలను ఆపానని ట్రంప్ చెప్పారు. అందులో కొన్ని 31 ఏళ్ల నుంచి కొనసాగుతున్నవీ ఉన్నాయి. ఇంకా 36 ఏళ్ల నుంచీ, 28 ఏళ్ల నుంచీ కొనసాగుతున్నవి ఉన్నాయని చెప్పుకొచ్చారు.
అమెరికా చాలా గొప్పది..
56 నిమిషాల ప్రసంగంలో అమెరికా గురించి గొప్పలు చెప్పుకున్నారు ట్రంప్. యూఎస్ లాంటి గొప్ప దేశం మరెక్కడా లేదని అన్నారు. ఏ దేశం..తమ దేశానికి సాటి రాదని గప్పాలు కొట్టుకున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ తాను వచ్చాక అత్యుత్తమంగా ఉందని అన్నారు. చరిత్రలోనే గొప్పగా దాన్ని తీర్చిదిద్దానని తెగ గొప్పలు చెప్పుకున్నారు ట్రంప్. అలాగే భారత్, చైనాలపై మరోసారి మిర్శల బాణాలను సంధించారు. చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ పై యుద్ధానికి ఉసి గొల్పుతున్నారని ట్రంప్ మరోసారి ఆరోపించారు. క్షమించరానిదేమంటే.. నాటో దేశాలు కూడా రష్యా నుంచి ఇంధనాన్ని, ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేయడం తగ్గించలేదు. దీనిపై నేను సంతోషంగా లేను అని చెప్పుకొచ్చారు. రష్యాకూడా యుద్ధాన్ని ఆపడానికి సిద్ధంగా లేదని అన్నారు. అందుకే తాను మరిన్ని సుంకాలతో దాడి చేయడానికి చెప్పారు. అవి త్వరలోనే అమల్లోకి వస్తాయని ట్రంప్ చెప్పారు.