Macron: ట్రంప్ కోసం ఫ్రీజ్.. ట్రాఫిక్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడి పాట్లు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం ఫ్రాన్స్ అధ్యక్షుడు ట్రాఫిక్ లో ఉండిపోవాల్సి వచ్చింది. న్యూ యార్క్ లో ఐరాస కార్యాలయానికి ట్రంప్ వస్తున్న సందర్భంగా అక్కడ ట్రాపిక్ ఆపేశారు. ఇందులో మెక్రాన్ చిక్కుకుపోయారు.

New Update
Macron

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో ఉంది. దీనికి అత్యధికంగా ఫండ్స్ ఇచ్చేది కూడా అమెరికానే.  ఈ కారణంగానే ఐరాసలో అమెరికా అధ్యక్షుడికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారు.  ఆయన వస్తున్నారు అంటే న్యూ యార్క్ లో మొత్తం ఫ్రీజ్ చేస్తారు. అంటే అధ్యక్షుడు ఐరాస కార్యాలయానికి వెళ్ళేంత వరకు ట్రాఫిక్ ను ఆపేస్తారు.  ఈరోజు న్యూ యార్క్ లో ఐరాస సర్వసభ్య సమావేశం జరిగింది. దీనిలో అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్నారు.  ఆయన వస్తున్న సమయంలో అక్కడ మొత్తం ఫ్రీజ్ చేశారు. ఇందులో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కూడా చిక్కుకున్నారు. 

రోడ్డు క్రాస్ చేయనివ్వకుండా...

కరెక్ట్ గా ట్రంప్ ఐరాసకు వస్తున్న సమయంలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ రోడ్డు క్రాస్ చేయడానికి ప్రయత్నించారు. కానీ అక్కడే ఉన్న ఓ పోలీసాఫీర్ మెక్రాన్ తో పాటూ మొత్తం సిబ్బందిని ఆపేశారు. ట్రంప్ వస్తున్నారు...ప్లీజ్ అర్ధం చేసుకోండి అని ఆ అధికారి అధ్యక్షుని పేరు చెప్పకుండా మెక్రాన్ ను ముందుకు వెళ్లకుండా ఆపేశారు. తాను ఫ్రాన్స్ అధ్యక్షుడినని..తమ దౌత్య కార్యాలయానికి వెళ్ళాలని ఎంత చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో విషయం అర్ధం చేసుకున్న మెక్రాన్ డైరెక్ట్ గా ట్రంప్ కే ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు. మీ కోసం ఇక్కడ ప్రతిదీ స్తంభించిపోయింది తెలుసా అంటూ మెక్రాన్ పెద్దగా నవ్వుతూ ట్రంప్ తో మాట్లాడారు. ఈ కాల్ మొత్తం సోసల్ మీడియాలో వచ్చింది.  ఈ ఫోన్ సంభాషణలో ఇరు నేతలూ స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారని తెలుస్తోంది. ఇద్దరూ చాలా సేపు సంభాషించుకున్నారని ఫ్రాన్స్ అధికార వర్గాలు తెలిపాయి. 

Also Read: Turkey: కశ్మీర్ సమస్యపై యూఎస్ జోక్యం.. మరోసారి విషం కక్కిన టర్కీ అధ్యక్షుడు

Advertisment
తాజా కథనాలు