/rtv/media/media_files/2025/03/10/5l1lReX2aWHEF77tMbWb.jpg)
H1B Visa
నాలుగు రోజుల క్రితం హెచ్-1బీ వీసా ఫీజులను బారీగా పెంచేసింది అమెరికా ప్రభుత్వం. అంతకు ముందు 215 డాలర్లుగా ఉన్న వీసా ఫీజు ఇప్పుడు లక్ష డాలర్లు అయింది. దీంతో అమెరికాకు రావాలనుకునేవారి సంఖ్య బాగా తగ్గిపోనుంది. కంపెనీలు కూడా ఇక మీదట ఉద్యోగులకు అంత మొత్తం ఇచ్చి తీసుకువచ్చే పరిస్థితులు లేవు. ఇక సొంతంగా లాటరీ వేసుకునే వారి పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. వారు ఎప్పటికీ అమెరికా రాలేరు.
నైపుణ్యం, ఎక్కువ జీతం ఉంటే ఓకే..
అయితే తాజాగా హెచ్-1బీ వీసా లాటరీ పద్ధతిలో కూడా ఆర్పులు చేసేందుకు రెడీ అయింది అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్. ఇందులో అధిక నైపుణ్యం ఉంది, ఎక్కువ జీతాలు పొందుతున్న వారికి లాభం చేకూరేలా రూల్స్ తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఫెడరల్ రిజిస్ట్రార్ తాజాగా విడుదల చేసింది. అధిక నైపుణ్యం ఉంటే విదేశీయులను లక్ష డాలర్ల ఫీజు లేకుండానే అనుమతిస్తారు. ఉద్యోగి వేతన స్థాయిని అనుసరించి రిజిస్ట్రేషన్ లో ప్రాధాన్యం కల్పించడం, వేతన వర్గీకరణ ఆధారంగా దరఖాస్తులను విభజించనున్నారని తెలుస్తోంది. అయితే ఎంత జీతం వస్తే వారిని నైపుణ్యత కలిగిన వర్కర్ల కింద పరిగణిస్తారు అనేది మాత్రం ఇంకా వివరాలు వెల్లడించలేదు. ఈ కొత్త నిబంధనను వచ్చే ఏడాది నుంచి అమలు చేసేందుకు ఆలోచిస్తోంది డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్. ఒకవేళ ఇవి అమల్లోకి వస్తే హెచ్-1బీ ఉద్యోగులకు చెల్లించే మొత్తం వేతనాలు 2026 ఆర్థిక సంవత్సరంలో 502 మిలియన్ డాలర్లకు పెరుగుతాయని ట్రంప్ కార్యవర్గం అంచనా వేసింది. 2027లో 1 బిలియన్ డాలర్లు, 2028లో 1.5 బిలియన్ డాలర్లు, 2029లో 2 బిలియన్ డాలర్లు వస్తాయని చెబుతోంది.
అయితే ఈ కొత్త రూల్స్ వలన అమెరికాలోనే చదువుకున్న వారికి, సొంతంతగా లాటరీ వేసుకుని రావాలనుకునే వారికి మాత్రం కష్టతరం అవనుంది. యూఎస్ లో చదువుకున్న వారిని కూడా కంపెనీలు చాలా ఎక్కువ జీతంతో తీసుకుంటేనే వారికి హెచ్1 వీసా వస్తుంది. ఏదో చదువుకున్నాం..ఏదో ఒక ఉద్యోగం చేద్దాం అంటే ఇక మీదట కుదిరే పని కాదు.