Nude Cruise: వామ్మో ఇలా కూడా ఉంటుందా..11 రోజులు బట్టలు లేకుండా..ప్రపంచంలోనే అతి పెద్ద క్రూజ్ షిప్ ప్రయాణం

వరల్డ్ లో అతి పెద్ద న్యూడ్ బోట్ ప్రయాణానికి సిద్ధమైంది. 2026 వాలైంటైన్ వీక్ లో ఇది సముద్రంలో తిరగనుంది.  మొత్తం 11 రోజుల ట్రిప్ కు గానూ రూ. 43 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 

New Update
cruise

ఒక దేశం నుంచి మరొక దేశానికి తిరిగే క్రూజ్ లగురించి అందరికీ తెలిసిందే. మన దేశంలో ఇవి చాలా తక్కువ ఉన్నాయి. కానీ అమెరికా, యూరోప్ వంటి దేశాల్లో క్రూజ్ లు చాలా ఫేమస్. వీటిల్లో తిరగడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అలాగే విదేవాల్లో న్యూడిటీ కూడా చాలా కామన్. అక్కడ ఎవరూ బట్టలకు ఇంపార్టెన్స్ ఇవ్వరు. బట్టలను బట్టి రేప్ లు జరగడాలు,, అమ్మాయిలను అదో రకంగా చూడడాలు ఉండవు. వ్యక్తిగత స్వేచ్ఛకు చాలా విలువనిస్తారు. యూరోప్ , అమెరికాల్లో న్యూడ్ బీచ్ లు కూడా ఉన్నాయి. అంటే అక్కడకు ఒంటి మీద ఏ బట్టా లేకుండా వెళ్ళొచ్చు. అలానే ఎంత సేపు అయినా అక్కడ ఉండొచ్చు. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో వస్తోంది న్యూడ్ క్రూజ్. 

క్రూజ్ షిప్ లు చాలా లగ్జరీగా ఉంటాయి. లోపలికి అడుగు పెట్టినప్పటి నుంచి.. బయటికి వచ్చేవరకు అన్ని రకాల సౌకర్యాలు అందులో కల్పిస్తూ ఉంటారు. లగ్జరీ, స్టార్ హోటల్స్ లో ఉండే సౌకర్యాలు మొత్తం ఈ క్రూయిజ్ షిప్ లలో ఉంటాయి. వీటి టికెట్ ఖరీదు కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది కానీ..ఈ ప్రయాణం ఒక అద్భుతం అని చెబుతుంటారు.  సముద్రం మీదనే కొన్ని రోజులు గడపడం మరపురాని అనుభూతి అని చెబుతుంటారు. 

అసభ్యానికి తావు లేదు..

ఇప్పుడు అమెరికాకు చెందిన బేర్ నెసెసిటీస్ అనే సంస్థ ప్రత్యేకంగా న్యూడ్ క్రూయిజ్ ను తీసుకువస్తోంది. దీని ప్రధాన లక్ష్యం.. బట్టలు లేకుండా ప్రయాణాలు చేయాలని ఆసక్తి ఉండే వారికి ఒక వేదికను కల్పించడమే. ఇది పూర్తిగా వ్యక్తిగత సౌకర్యం, స్వేచ్ఛ, నమ్మకానికి సంబంధించినదని నిర్వాహకులు చెబుతున్నారు.  దీనిలో ఎటువంటి లైంగిక కార్యకలాపాలకు తావు లేదు.  గౌరవం, బాడీ పాజిటివిటీ, సామాజిక ఐక్యతకు ప్రాధాన్యత ఇస్తారని స్పష్టం చేస్తున్నారు. ఈ న్యూడ్ క్రూజ్ షిప్ లో చాలా రకాల థీమ్ నైట్స్, వర్క్ షాప్ లు, పార్టీలను ఏర్పాటు చేయనున్నారు.  ఇందులో ఒకేసారి 2300 మంది ప్రయాణించవచ్చును. నార్వేజియన్ పెర్ల్ అనే షిప్ దీనికి వేదిక అవుతోంది. ఈ క్రూయిజ్ షిప్ లో 16 రెస్టారెంట్లు, 14 బార్లు, బౌలింగ్ లేన్లు, క్యాసినో, స్పా వంటి అత్యాధునిక సౌకర్యాలను ప్రయాణికులకు అందించనున్నారు.

అందుకే న్యూడ్ క్రూజ్ షిప్ లో కొన్ని కఠినమైన నిర్ణయాలను కూడా అమలు చేస్తున్నారు నిర్వాహకులు.  డైనింగ్ హాళ్లు, కెప్టెన్ రిసెప్షన్, సాంస్కృతిక కార్యక్రమాల సమయంలో, పోర్టుల్లో షిప్ ను ఆపినపుడు బట్టలు తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది. అలాగే షిప్ లో కొన్ని చోట్ల నో ఫోటో జోన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్స్, డ్యాన్స్ ఫోర్లలో ఫోటోలు తీయడం పూర్తిగా నిషేధం. ఇక బట్టలు లేకుంఆ ఉన్నారు కదాని ఎవరైనా అనుచితంగా ప్రవర్తించారో...వాళ్ళ సంగతి అంతే. ఎలాంటి రిఫండ్ లేకుండా ఎక్కడ పోర్టు వస్తే అక్కడే వారిని క్రూయిజ్ నుంచి నిర్దాక్షిణ్యంగా దింపేస్తారు. 

Advertisment
తాజా కథనాలు