/rtv/media/media_files/2025/09/24/dallas-2025-09-24-22-21-17.jpg)
అమెరికాలో రోజూ ఎక్కడో ఓ చోట కాల్పులు జరుగుతూనే ఉంటాయి. ఈమధ్య కాలంలో అక్కడ గన్ కల్చర్ చాలా ఎక్కువ అయిపోయింది. అందరికీ గన్ లైసెన్స్ ఉండడం వలన ఈ సంఘటనలు జరుగుతున్నాయి. అయితే ఇన్ని జరుగుతున్నా...ప్రభుత్వం మాత్రం గన్ లైసెన్స్ లను తీసేయడం లేదు. రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అత్యంత సన్నిహితుడు అయిన చార్లీ కిర్క్ కూడా ఈ గన్ కల్చర్ కు బాధితుడే. దీనిని అత్యంత ఎక్కువ సపోర్ట్ చేసిన వారిలో చార్లీ కిర్క్ ఒకడు. చివరకు అతను కూడా అదే కాల్పులకు బలి అవ్వాల్సి వచ్చింది.
తెలుగు వాళ్ళు ఉండే డాలస్ పురంలో...
దీని తరువాత కూడా ఒకటి , రెండు చోట్ల కాల్పులు జరిగాయి. తాజాగా భారతీయులు ఎక్కువగా ఉండే డాలస్ లో ఈరోజు ఉదయం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ పోర్స్ మెంట్ కేంద్రం దగ్గరలో ఈ ఘటన జరిగింది. ఇందులో దుండుగుడితో పాటూ ఇద్దరు మృతి చెందారని తెలుస్తోంది. చనిపోయిన వారు నిర్భంధంలో ఉన్న వారేనని...పోలీసు అధికారులకు ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు.
ఇమ్మిగ్రేషన్ భవనానికి దగ్గరలో ఉన్న మరో బిల్డింగ్ నుంచి దుండుగుడు కాల్పులు జరిపాడు. గాయపడిన వారిని అక్కడే ఉన్న పార్క్ ల్యాండ్ ఆసుపత్రికి తరలించారు. దాడి తర్వాత దుండుగుడు తనను తాను కూడా కాల్చుకున్నాడు. అయితే దాడికి గల కారణాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. సమాచారం తెలుసుకున్న భద్రతా, ఎమర్జెన్సీ బృందాలు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు మొదలుపెట్టాయి.