/rtv/media/media_files/2025/09/24/erdogan-2025-09-24-07-17-01.jpg)
Turkey President Recep Tayyip Erdogan
నూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రసంగించారు. ఇందులో ఆయన కాశ్మీర్ గురించి కూడా మాట్లాడారు. ముందస్తు తీర్మానం కోసం పిలుపునిచ్చారు. బారత్, పాకిస్తాన్ ల మధ్య కాల్పుల విరమణ తనకు సంతోషం కలిగించిందని ఎర్డోగన్ చెప్పారు. అయితే కాశ్మీర్ విషయంలో శాశ్వత పరిష్కారం తీసుకురావాల్సి ఉందని అన్నారు. కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితి తీర్మానాల ఆధారంగా పరిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. కాశ్మీర్ లో మా సోదరీమణులు, సోదరుల శ్రేయస్సు కోసం, చర్చల ద్వారా పరిష్కరించాలని మేము ఆశిస్తున్నామంటూ ఎర్డోగన్ మాట్లాడారు. అంతర్జాతీయ వేదికలపై ఆయన కాశ్మీర్ అంవాన్ని ప్రస్తావించడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మొదట్లో పాకిస్తాన్ పర్యటనలో కూడా ఎర్డోగన్ కాశ్మీర్ అంశంపై చర్చలు జరపాలని...UN తీర్మానాలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. తామెప్పుడూ కాశ్మీర్ కు సంఘీభావంగా నిలుస్తామని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ చెప్పారు.
Erdoğan again preaching on Kashmir at UNGA. Maybe he should first fix democracy, minorities & press freedom in his own country before lecturing others. 🙃 #UNGA2025
— Dr. Ashutosh Singh (@reach_ashutosh) September 23, 2025
మీరెవరు మాట్లాడ్డానికి...
టర్కీ అధ్యక్షుడి వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా తిరస్కరించింది. ఎర్డోగన్ తమ అంతర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ ఇండియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. దీనిపై వ్యాఖ్యానించడానికి మరే దేశానికీ ఎటువంటి హక్కు లేదని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. మరొక దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే బదులు పాకిస్తాన్ లో ప్రబలుతున్న సీమాంతర ఉగ్రవాదాన్ని ఎత్తిచూపాలని జైస్వాల్ సూచించారు. దానిపై ఎర్డోగన్ యూఎన్ లో మాట్లాడి ఉంటే సముచితంగా ఉండేదని అన్నారు. కాశ్మీర్ పై మాట్లాడే హక్కు ఏ ఇతర దేశానికీ లేదని జైస్వాల్ మరోసారి గట్టిగా చెప్పారు.
Also Read: Trump: ఐక్యరాజ్యసమితిపై విరుచుకుపడ్డ ట్రంప్..సరిగ్గా పని చేయట్లేదని ఆగ్రహం