BIG BREAKING: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై దాడి!
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై గుర్తుతెలియని వ్యక్తుల దాడి చేశారు. తార్నాక లోని ఆర్టీసీ హాస్పటల్ దగ్గరలో ఓ వాహనంపై దూసుకు వచ్చిన సుమారు 50 మంది దుండగులు ఎమ్మెల్యేపై దాడి చేసి పరారయ్యారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై గుర్తుతెలియని వ్యక్తుల దాడి చేశారు. తార్నాక లోని ఆర్టీసీ హాస్పటల్ దగ్గరలో ఓ వాహనంపై దూసుకు వచ్చిన సుమారు 50 మంది దుండగులు ఎమ్మెల్యేపై దాడి చేసి పరారయ్యారు.
వీసాల విషయంలో అమెరికా మార్పులు చేస్తూనే ఉంది. తాజాగా మరో కీలక మార్పుకు శ్రీకారం చుట్టిందని తెలుస్తోంది. జీతం, పొజిషన్ ఆధారంగా హెచ్-1బి వీసాలు జారీ చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ రివ్యూను పంపినట్లు తెలుస్తోంది.
హిమాచల్ ప్రదేశ్ లోని ఓ పెళ్ళి ఇప్పుడు నెట్టింట హల్ చల్ అవుతోంది. ద్రౌపది పాథ్ర అనే ఆచారం పేరుతో ఒక మహిళ ఇద్దరు అన్నదమ్ములను పెళ్ళిచేసుకుంది. పైగా రెండు రోజుల పాటూ ఈ వివాహాన్ని వేడుకగా చేసుకున్నారు.
మొత్తానికి భారత ఆటగాళ్ళ మొండిపట్టే గెలిచింది. డబ్ల్యూసీఎల్ లో ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ రద్దయింది. టీమ్ ఇండియా ఆటగాళ్ళు ఈ మ్యాచ్‌లో ఆడేందుకు విముఖత చూపడమే కారణమంటూ డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
మావోయిస్టుల ఏరివేత ఇంకా కొనసాగుతోంది. తాజాగా నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మాడ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో ఇప్పటి వరకు ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం.
క్రికెట్ ఆడడం కన్నా నాకు దేశమే ముఖ్యం. దేశం కన్నా ఏదీ ఎక్కువ కాదంటున్నాడు శిఖర్ ధావన్. డబ్ల్యూసీఎల్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడేందుకు తాను సిద్ధంగా లేనని మాజీ క్రికెటర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
నార్త్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో బీహార్, ఉత్తరప్రదేశ్ లలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీని వలన పలు ప్రాంతాల్లో ఇప్పటి వరకు 52 మంది చనిపోయారు.
బ్రిక్స్ దేశాలకు అమెరికా అధ్యక్షుడు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశాలు డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తే 10 శాతం అదనపు సుంకాలు ఎదుర్కోవలసి వస్తుందని బెదిరించారు. డాలర్ ఆధిపత్యం ఎప్పటికీ కొనసాగాల్సిందేనని తెగేసి చెప్పారు.