/rtv/media/media_files/2026/01/16/iran-2026-01-16-08-32-14.jpg)
ఇరాన్ లో ఆందోళనలు ఇంకా తగ్గలేదు. ఇరాన్ ప్రభుత్వం ఎక్కడా తగ్గడం లేదు. దాంతో ఆందోళనకారులు కూడా తమ నిరసనలను తీవ్రతరం చేస్తున్నారు. మరోవైపు ఆందోళనకారులను అణిచివేసేందుకు ఆ దేశం ప్రయత్నిస్తోంది. ఎక్కడిక్కడ అరెస్ట్ లు చేస్తోంది. ఈ క్రమంలో అరెస్ట్ చేసిన వారికి మరణ శిక్ష కూడా వేసేందుకు రెడీ అయింది. మొత్తం 800 మందికి మరణశిక్ష వేయాలని ఇరాన్ ప్రభుత్వం భావించింది. కానీ తరువాత దానిని విరమించుకుంది. అందుకు కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలే అని తెలుస్తోంది.
ట్రంప్ హెచ్చరించడం వల్లనే..
800మంది ఆందోళనకారులకు మరణశిక్ష వేసే నిర్ణయం నుంచి ఇరాన్ విరమించుకుందని అమెరికా వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. నిరసనకారులను అణచివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సైనిక చర్య చేపడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించినందు వల్లనే ఇరాన్ వెనక్కు తగ్గిందని ఆమె తెలిపారు. ఆ దేశ పరిస్థితులును తమ దేశ అధ్యక్షుడు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని...భవిష్యత్తులో ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చిన చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఇరాన్ పై దాడిని మాత్రం పోస్ట్ పోన్ చేసుకున్నారని లీవిట్ తెలిపారు.
గగనతలాన్ని మళ్ళీ ఓపెన్ చేసిన ఇరాన్..
ఇదెలా ఉంటే ఇరాన్ మూసివేసిన తన గగనతలాన్ని మళ్ళీ తెరిచింది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఇరాన్‌పై దాడి చేసే ఉద్దేశం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడంతో పరిస్థితులు సాధారణ దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం మూసివేసిన ఇరాన్ గగనతలాన్ని తిరిగి రీ-ఓపెన్ చేయగా, ఖతర్‌లోని ఎయిర్‌బేస్‌కు యూఎస్ బలగాలు మళ్లీ చేరుకున్నాయి. దీంతో ఇరు దేశాలూ శాంతించినట్లు స్పష్టం అవుతోంది. అంతకు ముందు రోజు తమ దేశ ఎయిర్ స్పేస్ ను మూసేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. ప్రత్యేక అనుమతితో ఇరాన్ కు వెళ్ళే, అక్కడి నుంచి వచ్చే విమానాలు తప్ప ఇంక వేటికీ అనుమతి లేదని తెలిపింది. దీనికి సంబంధించి నిన్న రాత్రి NOTAM (ఎయిర్‌మెన్‌కు నోటీసు) జారీ చేసింది. అయితే దీనికి ముందే ఇరాన్, ఇరాక్ గగనతలం అంతా ఖాళీ అయిందని విమాన ట్రాకింగ్ వెబ్ సైట్ లు చూపించాయి.
Also Read: Bike Accidents: 4 ఏళ్లలో 3.3 లక్షల మంది దుర్మరణం..బైక్ ప్రమాదాల్లో చనిపోతున్న జనాలు
Follow Us