Bike Accidents: 4 ఏళ్లలో 3.3 లక్షల మంది దుర్మరణం..బైక్ ప్రమాదాల్లో చనిపోతున్న జనాలు

ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో అంతర్జాతీయ స్థాయిలో భారత్ స్థానం ఆందోళన కరంగా ఉంది. నాలుగేళ్ళల్లో దాదాపు 3.3 లక్షల మంది బైక్ యాక్సిడెంట్లలో మరణించారని నివేదికలు చెబుతున్నాయి. 

New Update
bike

భారత్ లో రోడ్డు ప్రమాదలు ఎక్కువే జరుగుతాయి. మితి మీరిన వేగం, తాగి బండి నడపడం లాంటి వాటితో రోజూ ఎక్కడో అక్కడ ప్రజలు చనిపోతూనే ఉన్నారు. ముఖ్యంగా బైక్ యాక్సిడెంట్ల కారణంగా మన దేశంలో లక్షల్లో మరణాలు సంభవిస్తున్నాయి. అంతర్జాతీయంగా కూడా ఈ ప్రమాదాల్లో భారత్ స్థానం ఆందోళనకరంగా ఉంది. పెరుగుతున్న బైక్ యాక్సిడెంట్లపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం లెక్కలను కూ డా విడుదల చేసింది. వాటి ప్రకారం.. 2019 నుంచి 2023 వరకు గత 5 ఏళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారిలో దాదాపు సగం మంది బైక్ ప్రయాణికులే ఉన్నారు. 

సంగ కంటే ఎక్కువ బైక్ ప్రమాదాల వల్లనే..

గత ఐదేళ్ళల్లో భారత్ మొత్తం 7.78 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇందులో ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్య 3.35 లక్షలకు పైగా ఉంది. 2023లో బైక్ మరణాల శాతం 45 శాతం అంటే 77,539 మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న యువత 66 శాతం 18 నుంచి 34 ఏళ్ల వయస్సు వారు ఉన్నట్లు తేలింది.

కొత్త చట్టాలు, సంస్కరణలు..

ఈ ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం 2026 నాటికి భారీ సంస్కరణలు, కొత్త చట్టాలను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. వాటి వివరాలను మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.   మోటారు వాహన చట్టానికి సుమారు 61 సవరణలతో కూడిన నూతన రోడ్డు భద్రతా బిల్లును మరికొన్ని రోజుల్లో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది. వీటి ప్రకారం 2026 జనవరి నుంచి అమ్ముడయ్యే అన్ని కొత్త ద్విచక్ర వాహనాలకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరి కానుంది. ప్రతి కొత్త బైక్ కొనుగోలుతో పాటు.. షోరూమ్ యజమానులు ఐఎస్‌ఐ గుర్తింపు పొందిన రెండు హెల్మెట్లను ..రైడర్, పిలియన్  ఇద్దరి కోసం ఉచితంగా లేదా వాహనం ధరలోనే భాగంగా అందించాల్సి ఉంటుంది. అలాగే ఈ ఏడాదిలోనే వాహనాల మధ్య పరస్పర సమాచార మార్పిడికి ఉపయోగపడే వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ సిస్టమ్‌ను ప్రయోగాత్మకంగా తీసుకురానున్నారు.  ఇది పొగ మంచు, రోడ్డు బాలేకపోవడం వంటి వాటి విషయంలో డ్రైవర్లను అప్రమత్తం చేస్తుంది. ఇక రోడ్డు ప్రమాద బాధితులను కాపాడే వారికి ఇచ్చే రివార్డును రూ. 25 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే.. బాధితులకు 7 రోజుల పాటు రూ. 1.5 లక్షల వరకు ఉచిత క్యాష్‌లెస్ చికిత్స అందించనున్నారు.

Also Read: Nobel Peace Prize: అన్న మాట నిలబెట్టుకున్న మచాదో..నోబెల్ ను ట్రంప్ కు అందజేత

Advertisment
తాజా కథనాలు