/rtv/media/media_files/2026/01/15/iran-nuclear-2026-01-15-11-28-32.jpg)
ఇరాన్ ఆందోళనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా మూడు వేలు దాటింది. మరోవైపు ఖమేనీ ప్రభుత్వం ఎక్కడా తగ్గడం లేదు. సైనిక చర్యలతో నిరసనలను అణిచివేయడానికి ప్రయత్నిస్తోంది. ఆందోళనకారులను అరెస్ట్ లు చేస్తూ, వారిని ఉరి తీస్తోంది. ఈ నేపథ్యంలో ఆందోళనలు చేస్తున్న వారికి అమెరికా, అధ్యక్షుడు ట్రంప్ మద్దతు పలికారు. ఈ క్రమంలో అమెరికా సైన్యం దాడికి రంగం సిద్ధం చేసుకుందనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇరాన్, ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ ఏ మాత్రం భయపడడం లేదు. దానికి తోడు ట్రంప్ నే చంపేస్తామంటూ ప్రత్యక్ష బెదిరింపులు కూడా చేస్తున్నారు. ఇదంతా తమ దగ్గర ఉన్న అణ్వాయుధ సంపత్తిని చూసుకునే అని తెలుస్తోంది.
అభేధ్యమైన అణుకర్మాగారం..
గతేడాది జూన్ లో ఇరాన్ పై అమెరికా దాడులు చేసింది. అప్పుడు ఆ దేశ అణు కర్మాగారంపై కూడా దాడి చేసింది. అందులో ఆ కర్మాగారం దెబ్బ తింది. దీంతో వారు అణ్వాయుధాలను తయారు చేయడం మానేసారని...కర్మాగారం కూడా మూసేశారని అనుకున్నారు అందరూ. కానీ తాజా సమాచారం ప్రకారం ఇరాన్ ఫోర్డ్ లో ఉన్న అణు కర్మాగారాన్ని పాత నాటాంజ్ కేంద్రానికి సమీపంలో పికాక్స్ పర్వతాలలో ఒక కొత్త, విశాలమైన భూగర్భ ప్లాంట్ ను నెలకొల్పిందని తెలుస్తోంది. ఈ కొత్త కేంద్రం ఫోర్డో కంటే చాలా లోతుగా ఉందని చెబుతారు. కాంక్రీటు యొక్క బహుళ పొరలతో కప్పబడి, ఇది భూమి క్రింద 80 నుండి 100 మీటర్ల లోతులో ఉందని చెబుతున్నారు. అది కాకుండా ఇరాన్ తన పాత అణ్వాయుధ కేంద్రం 'తలేఘాన్' సమీపంలో 'తలేఘాన్-2' నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. భవిష్యత్తులో దాడులు జరిగినా..అది చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మించారని చెబుతున్నారు. అక్కడ అణ్వాయుధాలు కూడా ఉన్నాయని ఆ ధైర్యంతోనే ఇరాన్ అమెరికా బెదిరింపులకు లొంగడం లేదని చెబుతున్నారు. తమ అణ్వాయుధ సంపత్తిని నమ్మకునే ట్రంప్ ను సైతం బెదిరిస్తోందని అంటున్నారు.
Also Read: Trump VS Iran: ఈసారి బుల్లెట్ మిస్ కాదు..ట్రంప్ పై ఇరాన్ ప్రత్యక్ష బెదిరింపులు
Follow Us