/rtv/media/media_files/2026/01/16/iran-1-2026-01-16-10-25-44.jpg)
టెహ్రాన్‌పై దాడుల ప్రణాళికలను అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషంలో రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి తాము దాడి చేయాలనుకోవట్లేదని ట్రంప్ హామీ ఇచ్చినట్లు పాకిస్థాన్‌లోని ఇరాన్ రాయబారి ఒకరు మీడియాకు చెప్పారు. దీంతో ఇరు దేశాల మధ్యనా ఉద్రిక్తతలు కాస్త తగ్గాయి. దానికి తోడు ట్రంప్ హెచ్చరికలు కారణంగా ఇరాన్ కూడా ఆందోళనకారులు మరణశిక్షలను రద్దు చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది.
గగనతలాన్ని తెరిచిన ఇరాన్..
అమెరికా దాడి క్యాన్సిల్ అవడంతో ఇరాన్ కూడా తన గగనతలాన్ని మళ్ళీ తెరిచింది. దీంతో ఇరాన్‌కు దగ్గరలోని ఖతార్‌లో ఉన్న తమ కీలక అల్-ఉదెయిద్ వైమానిక స్థావరంతో పాటు పశ్చిమాసియా వ్యాప్తంగా పలు సైనిక స్థావరాల నుంచి ఖాళీ చేసిన అమెరికా సిబ్బంది తిరిగి తమ స్థావరాలకు తిరిగి వచ్చారని రాయిటర్స్ కథనం ప్రచురించింది. అంతేకాదు.. అల్-ఉదెయిద్‌లో భద్రతా హెచ్చరికల స్థాయిని కూడా తగ్గించినట్లు కూడా చెప్పింది.
అంతకు ముందు రోజు తమ దేశ ఎయిర్ స్పేస్ ను మూసేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. ప్రత్యేక అనుమతితో ఇరాన్ కు వెళ్ళే, అక్కడి నుంచి వచ్చే విమానాలు తప్ప ఇంక వేటికీ అనుమతి లేదని తెలిపింది. దీనికి సంబంధించి నిన్న రాత్రి NOTAM (ఎయిర్‌మెన్‌కు నోటీసు) జారీ చేసింది. అయితే దీనికి ముందే ఇరాన్, ఇరాక్ గగనతలం అంతా ఖాళీ అయిందని విమాన ట్రాకింగ్ వెబ్ సైట్ లు చూపించాయి.
మరోవైపు ఇరాన్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. అమెరికా దాడి చేస్తుందనే అనుమానంతో తాము కూడా యుద్ధానికి సిద్ధమైంది. తమ సైన్యంలో ఇరాక్ సైన్యాన్ని కూడా చేర్చుకుంది. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ధీటుగా ఇరాన్ కూడా ప్రత్యక్ష బెదిరింపులు చేసింది. ఈసారి బుల్లెట్ మిస్ కాదని హెచ్చరించింది. ఇంత వరకు మాటలతోనే బెదిరించిన ఇరాన్ ఇప్పుడు ప్రత్యక్ష దాడి చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. ఇందులో ఆయన చెవికి గాయం కూడా అయింది. బుల్లెట్ చెవిని తాకుతూ వెనక్కు పోయింది. అప్పటి ఘటనకు సంబంధించిన ఫొటోను ప్రసారం చేసిన ఇరాన్ టీవీ.. ఈసారి బుల్లెట్ గురి తప్పదు అని బెదిరింపుల సందేశాన్ని టెలికాస్ట్ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.
Also Read: USA: అమెరికాలో యాంటీ ఇండియన్ సెంటిమెంట్..రెండు కంపెనీలపై బాయ్ కాట్ ఉద్యమం..
Follow Us