/rtv/media/media_files/2025/12/04/trump-2025-12-04-16-04-45.jpg)
USA Orders H-1B, H-4 Visa Applicants To Make Social Media Profiles Public
అమెరికాలో అక్రమవలసలను అరికట్టడానికి ట్రంప్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటోంది. ఆందులో భాగంగా వీసాలు, ఇమ్మిగ్రెంట్ రూల్స్ లాంటి వాటిని మార్చింది. అమెరికన్ కంపెనీల్లో భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వలేని విధంగా హెచ్ 1బీ ఫీజులను పెంచేసింది. దాంతో పాటూ సోషల్ మీడియా వెట్టింగ్ లాంటి స్ట్రిక్ట్ రూల్స్ ను కూడా అప్లై చేస్తోంది. దీంతో ఇప్పటికే అమెరికా వచ్చే భారతీయుల సంఖ్య బాగా తగ్గిపోయింది. దానికి తోడు ప్రస్తుతం అమెరికాలో ఉన్న భారతీయులకు కూడా గడ్డు కాలం నడుస్తోందని తెలుస్తోంది. విదేశీ కార్మికులపై ఆంక్షలు విధించడంతో అమెరికాలో యాంటీ ఇండియన్ సెంటిమెంట్లు ఒక్కసారిగా పెరిగాయి. సోషల్ మీడియాలో ఇండియన్స్ బాయ్ కాట్ ఉద్యమం కూడా నడుస్తోంది. అలాగే వేధింపులకు కూడా పాల్పడుతున్నారని తెలుస్తోంది.
ఆ మూడు కంపెనీలకు ఆన్ లైన్ బెదిరింపులు..
అమెరికాలో పెద్ద కార్పొరేట్ కంపెనీలు అయిన ఫెడెక్స్, వాల్ మార్ట్,వెజోన్ లాంటివి ప్రస్తుతం ఆన్ లైన్ వేధింపులను ఎదుర్కుంటున్నాయి. దానికి కారణం ఆ కంపెనీలు అమెరికన్లను తొలగించి..వారి స్థానంలో ఇండియన్స్ కు జాబ్స్ ఇవ్వడమే. ముఖ్యంగా ఫెడెక్స్ సీఈఓ రాజ్ సుబ్రమణ్యం భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి కావడంతో.. ఆ కంపెనీపై జాత్యహంకార వ్యాఖ్యలు పెరిగాయి. రాజ్ సుబ్రమణ్యం ఉద్దేశపూర్వకంగా అమెరికన్లను జాబ్ నుంచి తొలగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆ కంపెనీ దానిని ఖండించింది. అయినా కూడా ఆన్ లైన్ ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు.
స్టాప్ ఏఏపీఐ హేట్, మూన్‌షాట్ సంస్థల డేటా ప్రకారం.. గత ఏడాది నవంబర్‌లో దక్షిణాసియా వాసులపై హింసాత్మక బెదిరింపులు 12 శాతం పెరిగాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో వారిపై జాత్యహంకార దూషణలు ఏకంగా 69 శాతం పెరగడం ఆందోళన కలిగించే విషయం. అమెరికాలోని మొత్తం హెచ్-1బి వీసా దారుల్లో దాదాపు 71 శాతం మంది భారతీయులే ఉన్నారు. అమెరికన్ల ప్రయోజనాలను కాపాడటానికే వీసా రూల్స్ మార్చామని..మిగతా రూల్స్ కూడా అందుకే అని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. కానీ అవన్నీ భారతీయులనే లక్ష్యంగా చేసుకున్నట్లు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కారణం వల్లనే అమెరికాలో 'మోడల్ మైనారిటీ'గా గుర్తింపు పొందిన భారతీయులు.. ప్రస్తుతం రాజకీయ, సాంస్కృతిక దాడులకు గురౌతున్నారు. కంపెనీలు కూడా ప్రస్తుతం ఏమీ గట్టిగా మాట్లాడలేని పరిస్థితి ఉంది. అయితే వివేక్ రామస్వామి వంటి కొందరు నేతలు ఈ ధోరణిని వ్యతిరేకిస్తున్నారు. ఒక అమెరికన్ కంటే మరో అమెరికన్ ఎక్కువ అనే ఆలోచన అమెరికన్ విలువలకే విరుద్ధమని అన్నారు.
Also Read: Iran-Trump: ట్రంప్ హెచ్చరించడం వల్లనే 800 మంది మరణశిక్షలు ఆగాయి..వైట్ హౌస్
Follow Us