Bihar Elections: బీహార్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించున్నారు.
పీపుల్స్ పల్స్ ప్రకారం, 2020లో కాంగ్రెస్ సాధించిన 9.6% ఓట్ల వాటాను జన్ సురాజ్ పార్టీ అధిగమిస్తుందని అంచనా వేసింది. అంతేకాదు ఈసారి కాంగ్రెస్ కు వచ్చే ఓట్లను కూడా ఈ పార్టీ చీల్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్లో కీలకంగా ఉన్న షాహీన్ సయీద్‌కు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబీకులతో సంబంధాలున్నట్లు తేలింది.
బీహార్ లో మరి కొద్ది సేపటిలో ఫలితాల లెక్కింపు మొదలవనుంది. ఇంకొన్ని గంటల్లో ఫలితాలు తేలిపోనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ అధికార ఎన్డీయే కూటమి వైపు మొగ్గు చూపినప్పటికీ.. తుది ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
ఢిల్లీ బాంబు పేలుడు, హైదరాబాద్ లోనూ ఉగ్రవాది పట్టుబడడంతో తెలుగు రాష్ట్రాల్లో మరింత ఎక్కువగా ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ నివాసంలో భారీగా విషపదార్థాలకు సంబంధించిన ముడిపదార్థాలను కనుగొన్నారు.
ఫరీదాబాద్-సహరాన్ పూర్ మాడ్యూల్ పై ఎన్ఐఏ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇందులో మరిన్ని కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. భారత్ లో బాంబు పేలుళ్ల కోసం జైషే ఉగ్రవాదులు మొబైల్ నంబర్ అవసరం లేని సెషన్ అనే యాప్ ను ఉపయోగించిందని తెలుస్తోంది.
ఢిల్లీ ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తులో భారత్ కు తమ అవసరం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. దర్యాప్తులో తాము సహాయం చేసేందుకు ముందుకు వచ్చామని...కానీ భారత అధికారులు అసాధారణ వృత్తి నైపుణ్యంతో పని చేస్తున్నారని అన్నారు.
ఢిల్లీ బాంబు బ్లాస్టర్ తో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఎప్పుడూ పాక్ నుంచి దాడులకు కుట్రలు చేసే ఉగ్రవాదులు ఇప్పుడు రూట్ మార్చారని తెలుస్తోంది. పాక్‌లోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేయటంతో స్థావరాలను టర్కీకి మార్చారని సమాచారం.