/rtv/media/media_files/2025/11/14/umar-1-2025-11-14-08-20-02.jpg)
ఢిల్లీ బాంబు పేలుడు ఘటన దర్యాప్తు వేగంగా జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో కారు నడిపిన ఉగ్రవాది, ప్రధాన నిందితుడు ఉమర్ నబీ ఇంటిని భద్రతా దళాలు పేల్చేశాయి. జమ్మూకశ్మీర్ పుల్వామాలోని అతడి ఇంటి వద్ద గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ కూల్చివేత ప్రక్రియను చేపట్టినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఆత్మాహుతి దాడి చేసిన ఉమర్ నబీ..
ఢిల్లీ ఎర్రకోట దగ్గర బాంబు పేలుడులో డాక్టర్ ఉమర్ నబీ పేరు వెలుగులోకి వచ్చింది. అక్కడ పేలిన కారును ఉమర్ నుడుపుతునట్టు ఆధారాలు బయటపడ్డాయి. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఉమర్ ను గుర్తించారు. ఇతనికి ఉగ్రవాద ముఠాతో సబంధాలు ఉన్నట్టు కూడా తెలిసింది. ఫరీదాబాద్ లో పట్టుబడ్డ ఉగ్రవాదులకు, ఉమర్ కు సంబంధాలు ఉన్నాయని..ఇతను కూడా అక్కడ నుంచే పారిపోయి వచ్చీ ఢిల్లీలో పేలుడుకి పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఎర్రకోట దగ్గర బాంబు పేలుడులో ఉమర్ మరణించి ఉంటాడని అధికారులు అనుమానించారు. కారు నడిపింది అతనే కాబట్టి ఉమర్ కచ్చితంగా చనిపోయాడని చెప్పారు. దీనిని కన్ఫార్మ్ చేసుకునేందుకు పుల్వామాలో ఉన్న అతని తల్లి దగ్గర నుంచి డీఎన్ఏ నమూనాలను తీసుకుని పరీక్షించారు. తాజాగా కారు నుంచి లభ్యమైన డీఎన్‌ఏ ఉమర్ నబీదేనని తేలినట్లు తెలుస్తోంది. దీంతో పేలుడు జరిగే సమయానికి అతడు వాహనంలోనే ఉన్నాడని అధికారులు నిర్ధరించినట్లు తెలుస్తోంది.
Follow Us