Delhi Blast Update: పేలుళ్ల కోసం టర్కీలో సమావేశం..కొత్త యాప్..అంతాహైటెక్ ప్లాన్

ఫరీదాబాద్-సహరాన్ పూర్ మాడ్యూల్ పై ఎన్ఐఏ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇందులో మరిన్ని కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. భారత్ లో బాంబు పేలుళ్ల కోసం జైషే ఉగ్రవాదులు మొబైల్ నంబర్ అవసరం లేని సెషన్ అనే యాప్ ను ఉపయోగించిందని తెలుస్తోంది.

New Update
new app

జైష్-ఎ-మొహమ్మద్ఉగ్రవాదసంస్థ ఫరీదాబాద్-సహరాన్‌పూర్ మాడ్యూల్‌పై జరిగిన దర్యాప్తులో ఒక ప్రధాన విషయం బయటపడింది. ఉగ్రవాదులు రోజురోజుకూ తెలివిమీరి పోతున్నారు. తమ కార్యకలాపాల కోసం కొత్త కొత్త టూల్స్, యాప్స్ ను ఉపయోగిస్తున్నారు. జైష్-ఎ-మొహమ్మద్ సూసైడ్ మాడ్యూల్‌లో నిందితులైన డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ ఉమర్ తమ హ్యాండ్లర్లతో కమ్యూనికేట్ చేయడానికి "సెషన్" అనే ఎన్‌క్రిప్టెడ్ మెసెంజర్ యాప్‌ను ఉపయోగించారని ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. ఈ యాప్‌కు ఖాతాను సృష్టించడానికి మొబైల్ నంబర్ అవసరం లేదు. అలాగే ఎన్ క్రిప్ట్‌డ్ చాట్ చేసుకోవచ్చును. డేటా కూడా సేవ్ చేయబడదని తెలుస్తోంది.

టర్కీ నుంచి సెషన్ యాప్ లో..

ఫరీదాబాద్ లో పట్టుబడ్డ డాక్టర్ ముజమ్మల్ దీనికి సంబంధించి చాలా విషయాలను బయటపెట్టాడు. జైషే మొహమ్మద్ తో తాను కమ్మూనికేష్ మొదలెట్టిన కొత్తల్లో అబు ఉకాసా అనే మారు పేరుతో చాట్ చేశారని తెలిపాడు. ఉకాసా అంటూ అరబిక్ లో స్పైడర్ అని అర్ధం. ఫరీదాబాద్ మాడ్యుల్‌, ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌తో పాటు అన్సర్‌ ఘజ్‌వత్‌- ఉల్‌ హింద్‌ అనే సంస్థల నిర్వాహకులకు ఈ ఉకాసాతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరు వర్చువల్ గా టర్కిష్ సంబర్ ను ఉపయోగించారని ముజమ్మల్ చెప్పాడు. ప్రారంభంలో హ్యాండ్లర్లు తనకు 90 కన్నా ఎక్కువ వాట్సాప్ నబర్లు ఇచ్చారని..అప్పుడు వాట్సాపే వాడానని చెప్పాడు. కానీ తరువాత సంభాషణలు ఎప్పటికీ లీక్ కాకుండా మరియు ఏజెన్సీలకు వాటి గురించి తెలియకుండా చూసుకోవడానికి సెషన్ యాప్‌లో కమ్యూనికేట్ చేయమని అతను తనను కోరారని తెలిపాడు. ఈ ఉకాసా అన్న వ్యక్తితో పాటూ మరికొంత మంది కూడా టర్కీ రాజధాని అంకారాలో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచే ఈ గ్రూప్‌ను నడపడంతో పాటు వారికి నిధులు కూడా సమకూర్చినట్లు భావిస్తున్నారు. ధిల్లీ పులుడుతో పాటూ భారత్ లో ప్లాన్ పేలుళ్ళ ప్రణాళిక వెనుక ఈ ఉకాసానే కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

సేఫ్ అని టర్కీ నుంచి..

ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ చిన్నగా అయింది కానీ...అసలు ఉగ్రవాదులు భారత్ లో దాదాపు 200 చోట్ల శక్తివంతమైన బాంబులు పేల్చి అల్లకల్లోలం సృష్టించాలని ప్లాన్ చేశారు. దీపావళి రోజునే దీనిని అమలు చేయాలని కుట్ర పన్నారు. అయితే అది వీలు కాకపోవడంతో డిసెంబర్6, జనవరి 26 తేదీల్లో దాడులకు ప్రణాళిక వేసినట్లు చెబుతున్నారు. పహల్గాం దాడి తరువాత బాతర్ ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో ఉగ్రవాద సంస్థలు ప్రస్తుతం పాక్ నుంచి తమ స్థావరాలు టర్కీకి తరలించాయి. నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (నాటో)లో భాగమైన టర్కీని ఉగ్ర డెన్‌గా మార్చుకున్నాయి. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలు భాగస్వామిగా ఉన్న నాటో కూటమి సభ్యదేశాలపై ఎవరు దాడి చేసినా ఇతర సభ్యదేశాలన్నింటిపై దాడి చేసినట్లుగానే భావించి అన్ని దేశాలు శత్రువుపై దాడి చేయాలన్న నిబంధన ఉండటంతో టర్కీపై భారత్‌ దాడి చేయదన్న ధీమాతో తమ కార్యకలాపాలను అక్కడికి మార్చినట్లు నిపుణులు చెబుతున్నారు.

Also Read: USA: ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో

Advertisment
తాజా కథనాలు