Delhi Blast: రూట్ మార్చిన ఉగ్రవాదులు..టర్కీ నుంచి దాడులకు ప్లాన్

ఢిల్లీ బాంబు బ్లాస్టర్ తో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఎప్పుడూ పాక్ నుంచి దాడులకు కుట్రలు చేసే ఉగ్రవాదులు ఇప్పుడు రూట్ మార్చారని తెలుస్తోంది. పాక్‌లోని ఉగ్ర స్థావరాలను భారత్‌ ధ్వంసం చేయటంతో స్థావరాలను టర్కీకి మార్చారని సమాచారం.

New Update
delhi blast docters

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వెనుక జైషే మహమ్మద్ హస్తం ఉందని ప్రాథమిక విచారణలో తెలిసింది. దాంతో పాటూ కారు బాంబు దాడికి కారణమైన ఫరీదాబాద్ ఉగ్రముఠాకు జైషే మహ్మద్ పాక్ నుంచి కాకుండా టర్కీ నుంచి ఆదేశాలిచ్చిందని తెలుస్తోంది. పాక్‌లోని ఉగ్ర స్థావరాలను భారత్‌ ధ్వంసం చేయటంతో స్థావరాలను టర్కీకి మార్చినట్లు సమాచారం. ఫరీదాబాద్ లో పట్టుబడ్డ ఉగ్రవాదుల విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి.

మొత్తం ప్లాన్ అంతా టర్కీ నుంచి..

ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ చిన్నగా అయింది కానీ...అసలు ఉగ్రవాదులు భారత్ లో దాదాపు 200 చోట్ల శక్తివంతమైన బాంబులు పేల్చి అల్లకల్లోలం సృష్టించాలని ప్లాన్ చేశారు. దీపావళి రోజునే దీనిని అమలు చేయాలని కుట్ర పన్నారు. అయితే అది వీలు కాకపోవడంతో డిసెంబర్6, జనవరి 26 తేదీల్లో దాడులకు ప్రణాళిక వేసినట్లు చెబుతున్నారు. పహల్గాం దాడి తరువాత బాతర్ ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో ఉగ్రవాద సంస్థలు ప్రస్తుతం పాక్ నుంచి తమ స్థావరాలు టర్కీకి తరలించాయి. నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (నాటో)లో భాగమైన టర్కీని ఉగ్ర డెన్‌గా మార్చుకున్నాయి. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలు భాగస్వామిగా ఉన్న నాటో కూటమి సభ్యదేశాలపై ఎవరు దాడి చేసినా ఇతర సభ్యదేశాలన్నింటిపైదాడిచేసినట్లుగానే భావించి అన్ని దేశాలు శత్రువుపై దాడి చేయాలన్న నిబంధన ఉండటంతో టర్కీపై భారత్‌ దాడి చేయదన్న ధీమాతో తమ కార్యకలాపాలను అక్కడికి మార్చినట్లు నిపుణులు చెబుతున్నారు.

200 చోట్ల భారీ ఎత్తున దాడులు..

ఇక భారత్ లో ఉన్న డాక్టర్లను ఆకర్షించడానికి జైషే మహమ్మద్ ఉగ్రవాది ఒకరు టెలీగ్రామ్ ను ఉపయోగించుకున్నారని తెలుస్తోంది. ఫరీదాబాద్ లో అరెస్ట్ అయిన వైద్యులను దీని ద్వారానే ఉగ్రవాదం వైపు మళ్లేలా చేశారని చెబుతున్నారు. ఫర్జాందాన్‌ ఇ దారుల్ఉలూమ్‌ , ఉమర్‌ బిన్‌ ఖత్తబ్‌‘ అనే టెలిగ్రాం గ్రూపుల ద్వారా వీరు తరుచూసంభాషించుకునేవారని గుర్తించారు. దీనంతటికీ కారణమైన షోపియాన్‌కు చెందిన మత గురువు ఇమామ్‌ ఇర్ఫాన్‌ అహ్మద్‌ ఆగాహ్‌ ఈ టెలిగ్రాం గ్రూపుల ద్వారానే టర్కీలోని జైషే మహ్మద్‌ ఉగ్రవాదితో మాట్లాడాడని దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. ఇక ఇమామ్ ఇర్ఫాన్, ఢిల్లీ కారు బాంబుతో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ నబీలు రెండు సార్లు జైషే మమహ్మద్హ్యాండ్లర్లను కలవడానికి టర్కీ కూడా వెళ్ళినట్లు బయటపడింది. దాని తర్వాతనే ఫరీదాబాద్ మాడ్యూల్ లో వేగం పుంజుకుందని చెబుతున్నారు. ప్రస్తుతం అదుపులో ఉన్న డాక్టర్లు అందరూ వేరే వేరే చోట్ల పని చేసేలా జైషే ఆర్డర్ పాస్ చేసింది. ఆ తర్వాత ముంబై తరహా దాడులతో చాలా పెద్దగా దాడులుచేయించాలని జైషే భావించింది. దేశంలోని ప్రధాన నగరాల్లోని కీలక ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, పెద్దపెద్ద షాపింగ్‌ మాల్స్‌లో దాదాపు 200 చోట్ల ఏకకాలంలో అత్యంత శక్తిమంతమైన ఐఈడీ బాంబులు పేల్చి విధ్వంసం సృష్టించాలని ప్రణాళిక వేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.

Also Read: USA: అధికారికంగా అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ ముగింపు

Advertisment
తాజా కథనాలు