/rtv/media/media_files/2025/11/14/counting-2025-11-14-08-07-54.jpg)
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించున్నారు.
బీహార్ లో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిల్లో రెండు ఎస్టీ, 38 ఎస్సీ రిజర్వ్ స్థానాలున్నాయి. ఇక్కడ ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే 122 సీట్లు రావాల్సిందే. బీహార్ లో మొత్తం 7.45 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3.92, స్త్రీలు 3.50 కోట్ల మంది ఉన్నారు. ఇక్కడ రెండు విడతల్లో ఎన్నికలు సాగాయి. రెండు దశల్లోనూ రికార్డు స్థాయిలో ఓట్ల శాతం నమోదైంది. పురుషుల్లో 62.98 శాతం, మహిళల్లో 71.78 శాతం మంది ఓటేశారు. మొదటి దశ పోలింగ్ నవంబరు 6న.. 121 స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 3.75 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. 1314 మంది అభ్యర్ఘథులు బరిలో నిలుచున్నారు. మొదటి దశలో 65 కన్నా ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. ఇక రెండో దశ నవంబర్11న 112 సీట్లకు పోలింగ్ జరిగింది. మొత్తం 3. 70 కోట్ల మంది ఓటర్లు ఓటు వేశారు. 1302 మంది అభ్యర్థులు పోటీ చేయగా..69 కన్నా ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది.
Follow Us