Delhi Blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో కొత్త విషయాలు, కొత్త పేరు..

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫరీదాబాద్‌ టెర్రర్‌ మాడ్యూల్‌లో కీలకంగా ఉన్న షాహీన్‌ సయీద్‌కు జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ కుటుంబీకులతో సంబంధాలున్నట్లు తేలింది.

New Update
afira

ముందే అనుమానించినట్టు ఢిల్లీ ఉగ్రదాడికి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్అజార్ కుటుంబీకులతో సంబంధాలున్నట్లు తేలింది. జైషే కమాండర్‌, పుల్వామా దాడి మాస్టర్‌మైండ్‌ ఉమర్‌ ఫరూక్‌ భార్య అఫీరా బీబీతో షాహీన్‌ టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

ఎవరీ అఫీరా బీబీ..

జషే మహమ్మద్ చీఫ్ మసూద్అజార్ మేనల్లుడు ఉమర్ ఫరూక్. 2019లో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని పొట్టనపెట్టుకున్నపుల్వామా దాడికి సూత్రధారి ఇతను. పుల్వామా దాడి తర్వాత భారత భద్రతా దళాలు ఉమర్ మట్టుబెట్టాయి. ఇతని భార్యే అఫీరా బీబీ. జైషే కొత్తగా ప్రారంభించిన మహిళా విభాగం జమాత్‌-ఉల్‌-మొమినాత్‌లో కీలక వ్యక్తి. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ కు కొన్ని రోజుల ముందు అఫీరా మహిళా విభాగం అడ్వైజరీ కౌన్సిల్‌లో చేరిందని తెలుస్తోంది. మసూద్అజార్‌ సోదరి సాదియాఅజార్‌తో కలిసి పనిచేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

షహీన్ కు కీలక బాధ్యతలు..

ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ లోని జైషే మహమ్మద్ ప్రాన కేంద్రం ధ్వంసం అయింది. ఇందులో మసూద్అజార్ కుటుంబ సభ్యులు చాలా మంది చనిపోయారు. దీని తరువాత జైషే మహిళా బ్రిగేడ్‌ల ఏర్పాటుకు ఆన్‌లైన్‌ కోర్సులు ప్రారంభించింది. దీనికి జమాత్‌ ఉల్‌ మొమినాత్‌ విభాగానికి మసూద్‌ సోదరి సాదియాఅజార్‌ లీడర్ గా ఉంది. ఇందులోనే ఫరీదాబాద్ లో పట్టుబడిన డాక్టర్ షహీన్ కు కీలక బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. మహిళలను మోసగించడంతో పాటు, వారిని తీవ్రవాద మార్గాలను అనుసరించేలా బలవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. షహీన్ ఇండియాలో రహస్యంగా పని చేస్తూ జేషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ విస్తరించేందుకు కృషి చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉగ్ర దాడులు జరిపేందుకు దాదాపు రెండేళ్ల నుంచి సన్నాహాలు చేస్తున్నట్లు ఆమె పోలీసుల విచారణలో తెలిపింది. డాక్టర్‌ ముజమ్మిల్, ఆదిల్‌తో కలిసి దాదాపు రెండేళ్ల నుంచి అమ్మోనియం నైట్రేట్‌ వంటి పేలుడు పదార్థాలను సేకరిస్తున్నట్లు అంగీకరించినట్లు సమాచారం.

Also Read: Bihar Elections: బీహారీల ఓటు ఎటువైపు? ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?