Bihar Elections: కాంగ్రెస్ కంటే ఎక్కువగా ప్రశాంత్ కిశోర్ పార్టీకి ఓట్లు..ఎగ్జిట్ పోల్స్ అంచనా

పీపుల్స్ పల్స్ ప్రకారం, 2020లో కాంగ్రెస్ సాధించిన 9.6% ఓట్ల వాటాను జన్ సురాజ్ పార్టీ అధిగమిస్తుందని అంచనా వేసింది. అంతేకాదు ఈసారి కాంగ్రెస్ కు వచ్చే ఓట్లను కూడా ఈ పార్టీ చీల్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

New Update
prashanth

బిహార్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తాడని భావించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలలు మరోసారి కల్లలయ్యేలా కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పెద్ద ఆశాజనకంగా అయితే చూపించలేదు. కానీ 2020లో కాంగ్రెస్ సాధించిన 9.6% ఓట్ల వాటాను జన్సురాజ్ పార్టీ అధిగమిస్తుందని పీలపుల్స్ పల్స్ పార్టీ అంచనా వేసింది. అంతేకాదు ఈసారి కాంగ్రెస్ కు వచ్చే ఓట్లను కూడా ఈ పార్టీ చీల్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

ఓట్లను చీల్చడానికి మాత్రమే..

బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కు సపష్టమైనవిజాన్ని కట్టబెట్టాయి ఎగ్జిట్ పోల్స్. మొత్తం మీద, అధికార కూటమి రాష్ట్రంలోని 243 సీట్లలో 147 సీట్లు గెలుచుకుంటుందని సూచిస్తున్నాయి. పోల్ సర్వేలలో ఒకటైన పీపుల్స్ పల్స్, ఎన్డీఏ 133-159 నియోజకవర్గాలు, మహాఘట్బంధన్ 75-101, ప్రశాంత్ కిషోర్ జాన్ సూరజ్ పార్టీ 0-5 గెలుచుకుంటాయని అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ కూడా ఎన్డీఏ 46.2%, మహా కూటమి 37.9% ఓట్లు సాధిస్తుందని అంచనా వేసింది.

ఆర్జేడీ అత్యధిక ఓట్ల వాటాను 23.3%తో నిలుపుకునే అవకాశం ఉందని, బీజేపీ 21.4%, జేడీయూ 17.6%, జాన్ సురాజ్ పార్టీ 9.7%, కాంగ్రెస్ 8.7% ఓట్లను పొందుతాయనిపోల్‌స్టర్ అంచనా వేసింది. 2020 ఓట్ల షేర్లతో పోల్చి చూస్తే, ఆర్జేడీ తన 23.5% వాటా నుండి 0.2 శాతం పాయింట్లు కోల్పోతుందని, బీజేపీ 1.6 శాతం పాయింట్లు పెరిగి 19.8% నుండి పెరుగుతుందని తెలుస్తోంది. జేడీయూ ఓట్ల షేర్ కూడా 1.9 శాతం పాయింట్లు పెరుగుతుందని, ఇది ఎన్డీఏ విజయానికి దోహదపడుతుందని అంచనా.

Also Read: Delhi Blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో కొత్త విషయాలు, కొత్త పేరు..

Advertisment
తాజా కథనాలు