USA: అధికారికంగా అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ ముగింపు...బిల్లుపై ట్రంప్ సంతకం

అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ను అధికారికంగా ముగించడానికి ప్రతినిధుల సభ 222-209 ఆధిక్యంతో తీర్మానం ఆమోదించింది. దీనిపై అధ్యక్షుడు ట్రంప్...వాషింగ్టన్ కాలమానం ప్రకారం రాత్రి 9.45 గంటలకు సంతకం చేశారు.

New Update
funding bill

మొత్తానికి అమెరికా ప్రభుత్వం అధికారికంగా తిరిగి ప్రారంభం అవనుంది. దీనికి సంబంధించిన బిల్లును అమెరికా ప్రతినిధుల సభ అత్యధిక ఓట్లతో ఆమోదించింది. 222-209 ఓట్లతో తీర్మానాన్ని సెనేట్ పాస్ చేసింది. అధ్యక్షుడు ట్రంప్మరికాసేపట్లో దీనిపై సంతకం చేయనున్నారు. జనవరి 2026 వరకు ప్రభుత్వ నిధులను ఈ బిల్లు ద్వారా సమకూర్చనున్నారు. దీని ద్వారా చట్టసభ సభ్యులు దీర్ఘకాలిక బడ్జెట్ ఒప్పందంపై చర్చలు జరపడానికి సమయం కూడా దొరకనుంది. ఫండింగ్ బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్ కొద్దిసేపటి క్రితం సంతకం చేశారు. 

ఓటు వేసిన ఎనిమిది మంది డెమోక్రాట్లు..

నిధుల బిల్లుపై చర్చను ముగించి, తదుపరి పరిశీలనకు తరలించడానికి సెనేట్‌లో కనీసం 60 ఓట్ల మద్దతు అవసరం. ఈ కీలక ఓటింగ్‌లో 8 మంది డెమొక్రాటిక్సెనేటర్లు తమ పార్టీ వైఖరికి భిన్నంగా రిపబ్లికన్లకు మద్దతుగా ఓటు వేశారు. దీంతో బిల్లుకు అవసరమైన మెజారిటీ లభించి, ఆమోదం పొందింది. అయితే, సెనేట్ డెమొక్రాటిక్ నేత చక్షుమెర్ సహా పలువురు సీనియర్ డెమొక్రాట్లు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించారు. అఫర్డబుల్ కేర్ యాక్ట్ (ACA) కింద ఆరోగ్య సంరక్షణ సబ్సిడీలను పొడిగించే అంశంపై స్పష్టమైన హామీ లేకపోవడమే వారి ఆందోళనకు ప్రధాన కారణం.

ప్రభుత్వం షట్ డౌన్ ముగిసిన తర్వాత దీర్ఘకాలిక బడ్జెట్, అలాగే ఒబామా కేర్ లాంటి వాటిపై సెనేట్ లో చర్చించనున్నారు. జనవరి 2026 వరకు టైమ్ ఉంది కాబట్టి వీటిపై సెనేట్ లో పలుసార్లు చర్చలు జరిగే అవకాశం ఉంది. అలాగే సెనేటర్లు తమ ఎలక్ట్రానిక్ రికార్డులను తమకు తెలియకుండా యాక్సెస్ చేస్తే US ప్రభుత్వంపై $500,000 వరకు దావా వేయడానికి అనుమతించడం అనే బిల్లుపై అనేక మంది హౌస్ రిపబ్లికన్ల నుండి విమర్శలను ఎదుర్కొంది. ప్రభుత్వం పూర్తిగా తిరిగి తెరిచిన తర్వాత ఆ నిబంధనను రద్దు చేయడానికి చట్టాన్ని ప్రవేశపెట్టే ప్రణాళికలను GOP సభ్యులు ఇప్పటికే సంకేతాలిచ్చారు.

Also Read: Trump: మీకెంత మంది భార్యలు..సిరియా అధ్యక్షుడికి ట్రంప్ ప్రశ్న

Advertisment
తాజా కథనాలు