USA: ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో

ఢిల్లీ ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తులో భారత్ కు తమ అవసరం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. దర్యాప్తులో తాము సహాయం చేసేందుకు ముందుకు వచ్చామని...కానీ భారత అధికారులు అసాధారణ వృత్తి నైపుణ్యంతో పని చేస్తున్నారని అన్నారు.

New Update
marco

ఢిల్లీ బాంబు పేలుడు కేసుపై భారత అధికారులు చాలా వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే దానికి వెనుక ఎవరు ఉన్నారనేదికనిపెట్టేశారు. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కూ రూబియో తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పేలుడుకు సంబంధించి దర్యాప్తునకు సాయం చేసేందుకు తాము ముందుకొచ్చామని.. కానీ ఆ అవసరం భారత్‌కు లేదని వ్యాఖ్యానించారు. కెనడాలో జీ7 విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు భారత ప్రభుత్వం ఢిల్లీ పేలుడు కేసు విచారణకు ఎన్‌ఐఏ 10 మంది అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసింది. అలాగే ఈ సంఘటన తర్వాత ఢిల్లీలోని అమెరికా రాయబారి కార్యాలయం కూడా స్పందించింది. ఢిల్లీలో జరిగిన భయంకరమైన పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల గురించే ఆలోచిస్తున్నాం. ఈ బాధ నుంచి వారు త్వరగా బయటపడాలని కోరుకుంటున్నాం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని కొత్త రాయబారి సెర్గియోగోర్ అన్నారు.

ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ..

ఇక ఈ జీ7 సమావేశాల్లో భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్, మార్కోరూబియోతో భేటీ అయ్యారు. ఇరువురూ మంత్రులూ భారత, అమెరికా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇందులో బాగంగానే ఢిల్లీ పేలుడుపై కూడా చర్చించారని తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

Also Read: Delhi Blast: రూట్ మార్చిన ఉగ్రవాదులు..టర్కీ నుంచి దాడులకు ప్లాన్

Advertisment
తాజా కథనాలు